హ్యాపీ డేస్ నిఖిల్ (Nikhil) ఇప్పుడు కార్తికేయ నిఖిల్ గా పాన్ ఇండియా (Pan India) స్థాయిలో గుర్తింపుని పొందాడు. ప్రస్తుతం స్వయంభూ అనే చారిత్రాత్మక మూవీ చేస్తున్నాడు. ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా స్వయంభూ మీద భారీ అంచనాలు ఉన్నాయి. పైగా నిఖిల్ (Nikhil) కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జట్ తో తెరకెక్కుతుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి స్వయంభు వాల్యూ ని మరింత పెంచింది.
సెంథిల్ కుమార్ దర్శకుడి ఊహాలకి ప్రాణం పోసి ప్రేక్షకులు కళ్ళు ఆర్పకుండా సినిమాని చూసేలా చేసే కెమెరామన్.. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించే కెమెరామెన్ ల్లో కూడా ఒకడు. ఇది సెంథిల్ సినిమా అనే కీర్తిని కూడా సంపాదించాడు. ఇప్పుడు ఈయన స్వయంభూ కి కెమెరా మెన్ గా చెయ్యబోతున్నాడు. ఆయనకీ వెల్ కం చెప్తు మేకర్స్ ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించారు. దీంతో స్వయంభూ ఒక విజువల్ వండర్‌గా నిలబడుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదే విధంగా సెంథిల్ లాంటి డిఓపీ దొరకటం నిఖిల్ అదృష్టమే అని చెప్పవచ్చు. పైగా స్క్రిప్ట్ నచ్చితినే సెంథిల్ ఒప్పుకుంటాడు. దీంతో ఇప్పుడు స్వయంభూ సగం హిట్ అయినట్టే అని కూడా భావించవచ్చు.
దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) సినీ ఎదుగుదలలో సెంథిల్ పాత్ర కూడా ఉంది. ఆ ఇద్దరి సినీ ప్రయాణం 20 సంవత్సరాల పై మాటే. సై దగ్గర్నుంచి స్టార్ట్ అయిన జర్నీ మగధీర (Magadheera), బాహుబలి (Baahubali), ఆర్ఆర్ఆర్ (RRR) వరకు కొనసాగుతునే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రాజమౌళి ఆత్మగా సెంథిల్ ని చెప్పుకోవచ్చు. ఇక స్వయంభూ కోసం నిఖిల్ పలు రకాల మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. సంయుక్త మీనన్, నభా నటేష్‌లు హీరోయిన్ లు గా చేస్తుండగా కేజీఎఫ్ (KGF) ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఠాగూర్ మధు (Tagore Madhu) సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు.