ఎన్టీఆర్ స్పీడ్ పెంచాడు.. ఒకటి సెట్లో ఉంటే, ఇంకొకటి లాంచైంది. మరొకటి ఇప్పుడు పట్టాలెక్కబోతోంది. అది కూడా సూపర్ స్టార్ రజినీ కాంత్ ని తుఫాన్ లా మార్చిన దర్శకుడి మేకింగ్ లో ఎన్టీఆర్ సునామీగా మారబోతున్నాడు. విచిత్రం ఏంటంటే ఆ టైటిల్ కూడా సునామీనే… కాకపోతే అది కేవలం ప్రాజెక్ట్ కి పెట్టుకున్న టెంపరరీ టైటిల్ అనితెలుస్తోంది. ఆల్రెడీ బాలీవుడ్ మూవీ ధూమ్ 3 సీక్వెల్ ధూమ్ 4 లో ఆర్యన్ రోల్ వేసేందుకు ఎన్టీఆర్ సిద్దమయ్యాడన్నారు. ఇంతలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ తీసిన నెల్సన్ దిలీప్ తో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి అల్ మోస్ట్ క్లియరెన్స్ వచ్చింది. హంబలే సంస్థే ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేలా ఉంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ తీసిన డైరెక్టర్ సినిమా ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. ప్రజెంట్ నెల్సన్ జైలర్ 2 పనులతో బిజీ అయ్యాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో లోకేష్ కనకరాజ్ తీస్తున్న కూలీ పూర్తయ్యాకే జైలర్ 2 పట్టాలెక్కుతుంది
ఆ తర్వాతే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీర్ తో నెల్సన్ దిలీప్ సినిమా సెట్స్ పైకెళుతుంది. స్టోరీ లైన్ కూడా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ ఎన్టీఆర్ వార్ 2 క్లైమాక్స్ షూటింగ్ తో బిజీ అయ్యాడు. జనవరి ఎండ్ కి వార్ 2 టాకీ పార్ట్, యాక్షన్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ప్రశాంత్ నీల్ డ్రాగన్ షూటింగ్ మొదలౌతుంది..
ఆతర్వాత దేవర 2 తోపాటు నెల్సన్ దిలీప్ కుమార్ మూవీ కూడా ప్యార్ లల్ గా ప్లాన్ చేశాడట ఎన్టీఆర్. ఈలోపు సూపర్ స్టార్ రజినీ కాంత్ తో నెల్సన్ ప్లాన్ చేసిన జైలర్ 2 కూడా పూర్తవుతుంది. ఓరకంగా చూస్తుంటే వార్ 2 పూర్తి కాకముందే, డ్రాగన్ ని లాంచ్ చేసిన ఎన్టీఆర్, ఆతర్వాత లైన్ లోకి దేవర 2ని, వెంటనే నెల్సన్ దిలీప్ తో మూవీని రెడీప్లాన్ చేస్తున్నాడు
ఈలెక్కన 2026 ఎండ్ వరకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దగ్గర కాల్ షీట్స్ కాలీగా ఉండే ఛాన్స్ లేదు. ఆల్ మోస్ట్ ప్రభాస్ లానే ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ పాన్ ఇండియా లెవల్లో దూసుకెళుతోంది. తన ప్లానింగ్ కూడా అలానే ఉంది. ఒక ప్రాజెక్ షూటింగ్ పూర్తవుతుంటే, మరో సినిమా మొదలవ్వటం… అది లాంచ్ అవుతున్న టైంలోనే ఇంకో సినిమా ప్లాన్ చేయటం…దానికి ప్యార్ లల్ గా మరో ప్రాజెక్ట్ ని కూడా ముందుగానే సెట్ చేయటం.
అంటే కనీసం చేతిలో మూడు నుంచి నాలుగు సినిమాలు ఉండేలా పర్ఫెక్ట్ స్పీడ్ తో దూసుకెళుతున్నాడు ఎన్టీఆర్. మాస్ మూవీల విషయంలో డబుల్ హ్యాట్రిక్ వేటలో దర్శకుల సెలక్షన్ లో షాక్ ఇస్తూ వస్తున్నాడు.