Rajinikanth: సోలో హీరోగా రావడానికి సీనియర్ హీరోలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. 60 ప్లస్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే.. పక్కన మరో స్టార్ వుండాల్సిందే. ఇంకో హీరో అండ లేకుండా వీళ్లు ఎందుకు బైటకు రాలేకపోతున్నారు..? కథలు డిమాండ్ చేస్తున్నాయా..? లేదంటే.. వీళ్లే మరో స్టార్ సాయం కోరుకుంటున్నారా..? జైలర్ హిట్‌కు మోహన్‌లాల్.. శివరాజ్‌కుమార్ హెల్ప్ అయ్యారు. వీళ్లు కనిపించేది తక్కువ సేపే అయినా.. పవర్‌ఫుల్ రోల్స్‌తో కథను ముందుకు నడిపించారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ క్రేజ్ ఉపయోగపడి మలయాళం.. కన్నడలో మంచి వసూళ్లు రాబట్టింది జైలర్. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ నటించే 170వ సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా నటిస్తున్నారు.
జై భీమ్ ఫేం జ్ఞానవేల్ డైరెక్ట్ చేసే ఈ మూవీ ఔట్ అండ్ ఔట్ మల్టీస్టారర్ మూవీగా మారిపోయింది. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీనంబర్ 150.. భోళాశంకర్ మాత్రమే సోలోగా జరిగింది. తమిళంలో హిట్టయిన కత్తి సినిమాకు ఖైదీ నంబర్ 150 రీమేక్ కావడంతో.. మరో హీరోతో అవసరం లేకుండా డ్యూయెల్ రోల్ పోషించారు చిరు. ఆ తర్వాత సైరాతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టడంతో హిందీ నుంచి అమితాబ్.. కన్నడనుంచి సుదీప్.. తమిళం నుంచి విజయ్ సేతుపతి సపోర్ట్ తీసుకున్నాడు చిరంజీవి. ఆ తర్వాత ఇదే స్ట్రాటజీ కంటిన్యూ చేస్తూ.. కొడుకు రామ్‌చరణ్‌తో కలిసి ఆచార్యలో నటించాడు మెగాస్టార్. దీంతో చిరు కూడా మరో హీరో సపోర్ట్ తీసుకుంటూ కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. గాడ్‌ఫాదర్ హిందీ మార్కెట్ కోసం సల్మాన్‌ఖాన్‌ను తీసుకుంటే.. బాలీవుడ్‌లో రూ.10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. వాల్తేరు వీరయ్యలో రవితేజ క్యారెక్టర్ సినిమాకు ప్లస్ అయిందని చిరంజీవే చెప్పాడు. విక్రమ్ హిట్ తర్వాత కమల్‌హాసన్ కూడా కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. రిస్క్ లేకుండా.. హిట్ కొట్టడం ఎలా అనే థియరీని ఆచరణలో పెట్టాడు. విక్రమ్ హిట్ కావడంతో.. తన ప్రతి సినిమాను మల్టీస్టారర్ మూవీని చేసేస్తున్నాడు కమల్.
విక్రమ్ సక్సెస్ తర్వాత కమల్‌హాసన్ నటించే సినిమాల లిస్ట్ పెరుగుతోంది. అటకెక్కిందనుకున్న భారతీయుడు 2 షూటింగ్ మళ్లీ మొదలైంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 35 ఏళ్ల తర్వాత మణిరత్నం కమల్‌తో సినిమా ఎనౌన్స్ చేశాడు. ఈ రెండు సినిమాలు మల్టీస్టారర్ మూవీస్ కావడం విశేషం. సినిమా రిస్క్‌ను తనమీదే వేసుకోకుండా.. అందరి క్రేజ్‌ను ఉపయోగించుకుని హిట్ కొట్టాలనుకుంటున్నాడు కమల్. విక్రమ్ క్లైమాక్స్‌లో రోలెక్స్‌గా సూర్య ఎంట్రీ అదిరిపోయింది. నెగిటివ్ షేడ్‌లో విజయ్ సేతుపతి యాక్టింగ్ ప్రశంసలు అందుకుంది. హెచ్ వినోద్ సినిమాలో విలన్‌గా విజయ్‌సేతుపతి పేరు వినిపిస్తోంది. స్టార్ హీరోల పేర్లు ఎనౌన్స్ చేయకపోయినా.. మణిరత్నం, కమల్ సినిమా కూడా మల్టీస్టారరే.