Rajinikanth: పడి లేచిన కెరటాళ్లా దూసుకెళ్ళిన పాన్ ఇండియా స్టార్స్

ఏళ్లకేళ్లుగా ప్రభాస్ దుమ్ముదులపటం చూడాలనుకున్న ఫ్యాన్స్‌కి మొత్తనికి సలార్ హిట్‌తో ఆ కల నెరవేరిసంది. ప్రభాస్ మళ్లీ ఒకప్పటి బాహుబలి రేంజ్‌లో దుమ్ముదులిపాడు. సాలిడ్ కంబాక్ ఇచ్చాడు.

  • Written By:
  • Publish Date - December 30, 2023 / 05:43 PM IST

Rajinikanth: రెబల్ స్టార్ ప్రభాస్, కింగ్ ఖాన్ షారుఖ్, సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈముగ్గురికి ఒకే అంశంలో, ఒకేలా పోలికలు పెరిగాయి. అవే సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన స్టార్స్‌గా ముగ్గురికీ ఒకేలా జర్నీ కొనసాగింది. 2023 ఈ ముగ్గురికి ఒకేలా కలిసొచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికొస్తే, బాహుబలి 1, 2 తర్వాత హిట్ కోసం సాహసాలు చేశాడు. కాని సాహో సగం సంతోషం మిగిలిస్తే, రాధేశ్యామ్, ఆదిపురుష్ పంచ్ ఇచ్చాయి. ఏళ్లకేళ్లుగా ప్రభాస్ దుమ్ముదులపటం చూడాలనుకున్న ఫ్యాన్స్‌కి మొత్తనికి సలార్ హిట్‌తో ఆ కల నెరవేరిసంది.

Kalki 2898 AD: వచ్చేది ఆ రోజునే.. కల్కి ట్రైలర్ కు డేట్ ఫిక్స్..!

ప్రభాస్ మళ్లీ ఒకప్పటి బాహుబలి రేంజ్‌లో దుమ్ముదులిపాడు. సాలిడ్ కంబాక్ ఇచ్చాడు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ విషయానికొస్తే, రోబో తర్వాత తను కాలా, కబాలి, రోబో 2, పేట, దర్బార్.. ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినా పంచ్ పడ్డాయి. అయితే, యావరేజ్ హిట్లు, కాదంటే ఫ్లాపులుగానే నిలిచాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ రేంజ్ అనిపించే సినిమానే రాలేదు. అలా తన ఫ్యాన్స్ డీలా పడిన టైంలో జైలర్ వచ్చి రూ.650 కోట్ల వసూళ్లు రాబట్టడమే కాదు, ఒకప్పటి రజినీ రేంజ్‌ని రుచి చూపించింది. ఇలా రజినీ.. ఐ యామ్ బ్యాక్ అంటే, కింగ్ ఖాన్ షారుక్ అంతకుమించి అన్నాడు. నిజమే.. ఐదేళ్లుగా తన సినిమాల్లేవు.

మధ్యలో తన కొడుకు డ్రగ్స్ ఇష్యూ తనని మానసికంగా కుంగిపోయేలా చేసింది. కట్ చేస్తే, పటాన్ వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టింది. జవాన్ మరో వెయ్యికోట్లతో షారుఖ్ రేంజ్ ఏంటో తెలిసేలా చేసింది. డంకీ పెద్దగా ఆకట్టుకోకపోయినా, కింగ్ ఖాన్ సాలిడ్ కంబాక్ ఇచ్చింది మాత్రం ఈఏడాదే..