Rajinikanth: కూలీకి 280 కోట్లా.. ప్రభాస్‌కే ఊహించని ఝలక్..

2015లో ప్రభాస్ పారితోషికం జస్ట్ 15 కోట్లు. బాహుబలి 2తో 75 కోట్లకు రీచ్ అయ్యాడు. తర్వాత సాహోకి వందకోట్లు, రాధేశ్యామ్‌కి రూ.150 కోట్లు అందుకుని, కల్కికి రూ.200 కోట్లు తీసుకున్నాడు. 200 కోట్ల రెమ్యునరేషన్ అంటూ వచ్చిన వార్త ఏడాది క్రితం సెన్సేషన్ అయ్యింది.

  • Written By:
  • Publish Date - April 26, 2024 / 09:18 PM IST

Rajinikanth: సూపర్ స్టార్ రజినీ కాంత్ 280 కోట్ల రెమ్యునరేషన్‌తో ఆసియాలోనే నెంబర్ వన్ అంటున్నారు. ఎప్పుడో పదేళ్ల క్రితం ఈ మాట విన్నాం. మళ్లీ ఇప్పుడు రజినీకాంత్ ఆసియా నెంబర్ వన్ అంటున్నారు. 2015లో బాహుబలి వచ్చింది. తర్వాతే సౌత్ హీరోల స్థాయి పెరుగుతూ వచ్చింది. 2015లో ప్రభాస్ పారితోషికం జస్ట్ 15 కోట్లు. బాహుబలి 2తో 75 కోట్లకు రీచ్ అయ్యాడు. తర్వాత సాహోకి వందకోట్లు, రాధేశ్యామ్‌కి రూ.150 కోట్లు అందుకుని, కల్కికి రూ.200 కోట్లు తీసుకున్నాడు.

VIJAY DEVARAKONDA: రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. షాకింగ్ నిర్ణయం..!

200 కోట్ల రెమ్యునరేషన్ అంటూ వచ్చిన వార్త ఏడాది క్రితం సెన్సేషన్ అయ్యింది. అప్పటికీ రజినీకాంత్ పారితోషికం రూ.125 కోట్లే. అంటే ఖాన్లు, కపూర్లు, అందరు 120 కోట్ల లోపు రెమ్యునరేషన్ తీసుకుంటుంటే, రజినీకాంత్ ఒక్కడే 125 నుంచి 140 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అలాంటి టైంలో ప్రభాస్ 150 కోట్లు, 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవటం రికార్డే. అలా ఆసియా నెంబర్ వన్ అయ్యాడు ప్రభాస్. అయితే, ఇప్పుడు లోకేష్‌తో చేస్తున్న మూవీ కూలీకి రజినీ 260 నుంచి 280 కోట్లు తీసుకుంటున్నారు. అంటే చైనా హీరో జాకీచాన్ కంటే రెండు రెట్లు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నట్టే. చరణ్, ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత 100 నుంచి 120 కోట్లు తీసుకుంటుంటే, పుష్ప 2కి బన్నీ 100 కోట్లు తీసుకున్నాడు. ఇక పవన్, మహేశ్ ఇద్దరూ 140 నుంచి 160 కోట్లు తీసుకుంటున్నారు. రాజమౌళి మూవీకి మహేశ్ ఇప్పుడు 200 కోట్లు తీసుకుంటున్నాడు.

అయితే ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే సలార్ 2కి, స్పిరిట్‌కి, హనురాఘవపూడి సినిమాలకు 300 కోట్ల చొప్పున ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అదే నిజమైతే, రజినీకాంత్ కంటే 20 కోట్లు ఎక్కేవ. అలా చూస్తే ఆసియా నెంబర్ వన్ రెబల్ స్టార్ ప్రభాసే అవుతాడు. అంతేకాదు.. 200 కోట్ల రెమ్యూనరేషన్‌తో ఒకసారి ఆసియా నెంబర్ వన్ అనిపించుకున్న ప్రభాస్, ఇప్పుడు రజినీకాంత్‌ని మరోసారి బీట్ చేసి 300 కోట్లతో ఆసియా నెంబర్ వన్ స్థానంలో కూర్చునే ఛాన్స్ ఉంది.