Rajinikanth: క్రేజీ కాంబో.. రజినీకాంత్ కోసం రంగంలోకి దిగనున్న రణ్‌వీర్‌ సింగ్..

సమ్మర్ నుంచి రజినీకాంత్‌తో లోకేష్ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు లోకేష్. రజినీకాంత్ సినిమాను పాన్ ఇండియా లెవల్లో సాలిడ్‌గానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు.

  • Written By:
  • Publish Date - December 18, 2023 / 07:52 PM IST

Rajinikanth: రణ్‌వీర్‌ సింగ్ ఇప్పుడు రెండో రోలెక్స్‌గా మారాడా? సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో విలన్‌గా తను కనిపించబోతున్నాడా..? ఈ డౌట్లు ఆల్‌మోస్ట్ నిజం అయ్యేలా ఉన్నాయి. జైలర్ తర్వాత లాల్ సలామ్ మూవీతో దండెత్తబోతున్న రజినీకాంత్ ఆ తర్వాత జ్ఞానవేల్ మేకింగ్‌లో వెట్టయ్యాన్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత సమ్మర్ నుంచి రజినీకాంత్‌తో లోకేష్ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.

PUSHPA 2: బిజినెస్‌లో సరికొత్త రికార్డు సృష్టిస్తున్న పుష్ప 2..

స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు లోకేష్. రిలీజ్ డేట్‌ని ముందే ఎనౌన్స్ చేయబోనని మొన్నే తేల్చిన లోకేష్, రజినీకాంత్ సినిమాను పాన్ ఇండియా లెవల్లో సాలిడ్‌గానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. అందుకే శంకర్ దారిలో నడవాలని ఫిక్స్ అయ్యాడట. శంకర్ కూడా రోబో 2.0కి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌ని పక్షిరాజా పాత్రలో విలన్‌గా తీసుకున్నాడు. అచ్చం అలానే బాలీవుడ్ మార్కెట్ కోసం ఇప్పుడు రణ్‌వీర్‌సింగ్‌ని విలన్‌గా తీసుకుంటున్నాడట లోకేష్. విక్రమ్‌లో సూర్య వేసిన రోలెక్స్ పాత్ర సౌత్‌లో భారీగా పేలింది.

కాని నార్త్‌లో జనానికి పాత్రవరకు నచ్చినా, అందులో హిందీ హీరో ఉంటే ఇంకాస్త ఎక్కువ కనెక్ట్ అయ్యేదన్నారు. అది మనసులో పెట్టుకుని ఈసారి రజినీకాంత్ మూవీలో హిందీ హీరో రణ్‌వీర్‌సింగ్‌ని విలన్‌గా తీసుకుంటున్నాడట లోకేష్ కనకరాజ్.