LEO: లియోకు ఫ్లాప్ టాక్.. రజనీ ఫ్యాన్స్ ఖుషీ..

విజయ్‌కు బీస్ట్‌ వంటి డిజాస్టర్‌ ఇచ్చిన నెల్సన్‌తో వర్క్‌ చేయొద్దని ఫ్యాన్స్‌ రజనీపై ఒత్తిడి తీసుకొచ్చారు. నిర్మాత కూడా డైరెక్టర్‌ను మారుద్దామంటే.. నెల్సన్‌పై వున్న నమ్మకంతో ఛాన్స్‌ ఇచ్చాడు రజనీ. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకున్న నెల్సన్‌ జైలర్‌ వంటి హిట్‌తో రజనీకాంత్‌ కెరీర్‌లో తిరుగులేని హిట్‌ ఇచ్చాడు.

  • Written By:
  • Publish Date - October 22, 2023 / 08:22 PM IST

LEO: లియోకు డివైడ్‌ రావడంతో రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీగా వున్నారు. ఫ్యాన్స్ ఎప్పుడూ అంతే. ప్రత్యర్థి మూవీ పోతే ట్రోల్‌ చేయడం కామనే. అయితే.. ఇక్కడ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయి రజనీకి హిట్‌ తీసుకొస్తుందన్న నమ్మకంతో వున్నారు ఫ్యాన్స్‌. ఈలెక్కన రజనీకాంత్‌ 171వ సినిమా హిట్టేనా..? ఈ సెంటిమెంట్ కథేమిటో చూసేద్దామా. విజయ్‌కు బీస్ట్‌ వంటి డిజాస్టర్‌ ఇచ్చిన నెల్సన్‌తో వర్క్‌ చేయొద్దని ఫ్యాన్స్‌ రజనీపై ఒత్తిడి తీసుకొచ్చారు.

నిర్మాత కూడా డైరెక్టర్‌ను మారుద్దామంటే.. నెల్సన్‌పై వున్న నమ్మకంతో ఛాన్స్‌ ఇచ్చాడు రజనీ. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకున్న నెల్సన్‌ జైలర్‌ వంటి హిట్‌తో రజనీకాంత్‌ కెరీర్‌లో తిరుగులేని హిట్‌ ఇచ్చాడు. నెల్సన్‌ సెంటిమెంట్ రజనీకాంత్ విషయంలో మరోసారి వర్కవుట్ అవుతుందా..? రీసెంట్‌గా రిలీజైన విజయ్‌ లియోకు ఏవరేజ్‌.. ఫ్లాప్‌ టాక్‌ రావడమే ఇందుకు కారణం. బీస్ట్‌ ఫ్లాప్‌ తర్వాత నెల్సన్‌.. జైలర్‌ వంటి హిట్‌ ఇచ్చినట్టు.. లియో ఫ్లాప్‌ అయినా.. లోకేశ్‌ రజనీకాంత్‌కు హిట్‌ ఇస్తాడన్న సెంటిమెంట్‌తో వున్నారు అభిమానులు. రజనీకాంత్‌ ప్రస్తుతం జై భీమ్‌ ఫేమ్ జ్ఞానవేల్ డైరెక్షన్‌లో నటిస్తున్నాడు.

ఈ సినిమా పూర్తికాగానే.. లోకేశ్‌ సినిమా సెట్స్‌పైకి వస్తుంది. లోకేశ్‌ ముందు ఖైదీ2.. విక్రమ్‌2.. సూర్యతో రోలెక్స్‌ లైన్లో వున్నా.. అనుకోకుండా రజనీకాంత్‌తో కమిటయ్యాడు. విజయ్‌కు ఫ్లాప్‌ ఇచ్చిన డైరెక్టర్‌ కావడంతో.. రజనీకి హిట్‌ ఇస్తాడన్న నమ్మకం ఫ్యాన్స్‌కి ఉంది.