Rajinikanth: రియల్ హీరో.. పేదల కోసం ఆసుపత్రి నిర్మాణం.. దటీజ్ రజినీకాంత్

చాలా మందికి గుప్త దానాలు చేయడంలో రజినీకాంత్ ముందు వరుసలో ఉంటారు. చేసిన సాయం చెప్పుకోకుండా తన వంతు సాయం చేస్తుంటారు. తమిళనాడుకు వరదలు వచ్చిన సమయంలో ఆపన్నహస్తం అందించారు.

  • Written By:
  • Updated On - March 4, 2024 / 04:48 PM IST

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది అన్ని భాషలతో పాటు.. హిందీ పరిశ్రమలో అడుగుపెట్టి పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా ఎదిగాడు. ఇండియాలోనే కాదూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అశేషమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండటం ఆయన నైజం. సుమారు 174 చిత్రాల్లో నటించిన ఆయన సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటున్నాడు. చాలా మందికి గుప్త దానాలు చేయడంలో రజినీకాంత్ ముందు వరుసలో ఉంటారు.

Rc 16 : ఫుల్ స్వింగ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్..

చేసిన సాయం చెప్పుకోకుండా తన వంతు సాయం చేస్తుంటారు. తమిళనాడుకు వరదలు వచ్చిన సమయంలో ఆపన్నహస్తం అందించారు. అలాగే కరోనా సమయంలో రోడ్డున పడ్డ సినీ కార్మికుల సహాయార్ధం ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘానికి 50 లక్షలు అందజేశారు. తెలిసినవే కాకుండా తెలియని దానాలు ఎన్నో చేశారు ఆయన. ఎప్పుడూ ప్రజలే దేవుళ్లుగా భావించే ఈ సూపర్ స్టార్.. ఇప్పుడు వారి కోసమే ఓ ఆసుపత్రి కట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. చెన్నై ఓఎంఆర్ రోడ్డు నుండి తలంబూరు వెళ్లే మార్గంలో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు రజనీకాంత్. అక్కడ ఆసుపత్రిని నిర్మించాలని యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చెంగల్ పట్టులోని తిరుప్పొరూర్‌లోని రిజిస్టార్ కార్యాలయాన్ని సందర్శించారు.

కొత్తగా కొనుగోలు చేసిన భూమిని రిజిస్టర్ చేయించేందుకు వచ్చారాయన. పేదలకు న్యాణమైన ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఆ ప్రాంతంలో భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలనుకుంటున్నారట ఈ సూపర్ స్టార్. ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని సమాచారం. ఆ హాస్పిటల్ నిర్మాణ పనుల బాధ్యతల్ని తన స్నేహితుడికి అప్పగించినట్లు తెలుస్తోంది.
https://youtu.be/E19fclxqvYw