Jailer: ఓటీటీలో జైలర్.. ఆల్‌టైమ్‌ రికార్డు కొట్టేనా..?

ఆగస్ట్‌ 10న రిలీజైన జైలర్‌ బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత కోసి రూ.600 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్ట్ చేసింది. తమిళంలో రూ.100 కోట్ల షేర్‌ కలెక్ట్ చేసి ఈ మార్క్‌ దాటిన రెండో సినిమాగా నిలిచింది. అయితే టాప్‌ ప్లేస్‌కు చేరాలంటే ఇంకో రూ.10 కోట్లు కలెక్ట్ చేయాలి.

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 05:43 PM IST

Jailer: జైలర్‌ తమిళనాడులో అరుదైన రికార్డుకు చేరువైంది. నెంబర్ ఒన్‌ అనిపించుకోవాలంటే.. ఇంకో పది కోట్లు కలెక్ట్ చేయాలి. ఓటీటీలోకి వచ్చేసిన జైలర్ టాప్ ప్లేస్‌కు చేరుతుందా..? లేదంటే సెకండ్‌ ప్లేస్‌తో సరిపెట్టుకోవాల్సిందేనా..? ఆగస్ట్‌ 10న రిలీజైన జైలర్‌ బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత కోసి రూ.600 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్ట్ చేసింది. తమిళంలో రూ.100 కోట్ల షేర్‌ కలెక్ట్ చేసి ఈ మార్క్‌ దాటిన రెండో సినిమాగా నిలిచింది. అయితే టాప్‌ ప్లేస్‌కు చేరాలంటే ఇంకో రూ.10 కోట్లు కలెక్ట్ చేయాలి.

పొన్నియన్‌ సెల్వన్‌-1 రూ.110 కోట్ల షేర్‌తో టాప్‌ ప్లేస్‌లో వుంది. జైలర్‌ అమేజాన్‌‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ కాకపోతే రూ.10 కోట్లు కలెక్ట్‌ చేయడం పెద్ద విషయం కాదు. అమెజాన్‌ ప్రైమ్‌లోకి వచ్చేయడం, జవాన్‌ సందడి నడవడంతో జైలర్‌.. రూ.111 కోట్లతో తమిళనాడులో ఎక్కువ కలెక్ట్‌ చేసిన మూవీగా నిలుస్తుందా..? లేదా అన్న ఆసక్తి నెలకుంది. తమిళనాడులో ఎక్కువ కలెక్ట్ చేసిన మూడో చిత్రం రికార్డ్‌ విక్రమ్‌ పేరు మీద వుంది. తమిళనాట రూ.91 కోట్ల షేర్‌ 185 కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసింది. చాలాకాలం ఈ రికార్డ్‌ బాహుబలి-2 పేరు మీదే వుండడం విశేషం. బాహుబలి-2 మూవీ తమిళనాడులో రూ.79 కోట్ల షేర్‌ కలెక్ట్ చేసి టాప్‌ ప్లేస్‌లో వుండగా విక్రమ్‌ దీన్ని బ్రేక్‌ చేసింది.