Rajamouli: బాహుబలి + RRR = సూపర్ హనుమాన్ మహేశ్ బాబు..

రాజమౌళి ఏం చేస్తున్నాడు? మహేశ్ బాబుకోసం నిజంగా లార్డ్ హనుమాన్ ని ప్రేరణగా తీసుకుని పాత్రని డిజైన్ చేశాడా? నెక్ట్స్ పాన్ వరల్డ్ మూవీలో మహేశ్ బాబు హనుమాన్ అంశగా కనిపిస్తాడా? ఇవే సోషల్ మీడియాను కుదిపేస్తున్న డౌట్లు..

  • Written By:
  • Publish Date - April 13, 2023 / 06:00 PM IST

అయితే ఈ డౌట్లలో ఒకటి మాత్రం నిజం అదే హనుమాన్ దేవుడి ఆధారంగా జక్కన్న తన కొత్త సినిమాలో హీరోపాత్రని డిజైన్ చేయటం. సౌత్ ఆఫ్రీకా అడవుల్లో సాహసాల ఆధారంగా మహేశ్ బాబు మూవీ అంటే అంతా ఇండియానా జోన్స్ లాంటి మూవీ అనుకున్నారు. కొంతవరకు అదీ నిజమే. ఇండియానా జోన్స్ ఫ్లేవర్ ని కూడా రాజమౌళి వాడుకోబోతున్నాడు. అందుకోసం హాలీవుడ్  డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ స్పిల్ బర్గ్ దగ్గర రైట్స్ కూడా తీసుకున్నాడు. సో ఇండియానా జోన్స్ ఫార్ములాని వాడినా దాన్ని ఇండియన్ వర్షన్ గా మార్చేందుకు హానుమాన్ దేవుడి సాయం తీసుకోబోతున్నాడట జక్కన్న

సౌత్ ఆఫ్రికన్ రైటర్ తాలూకు నవలే రాజమౌళి కొత్త మూవీ కథకి మేయిన్ సోర్స్. అయితే ఆ కథలోని కథానాయకుడికి హానుమాన్ లా సూపర్ న్యాచురల్ పవర్స్ ని యాడ్ చేయబోతున్నాడు జక్కన్న. అంతేకాదు ఇది సీతా స్వయం వరంలో శ్రీరాముడు విరిచిన విల్లుని వెతికే విలన్లను ఎదుర్కునేందుకు హనుమంతుడు మనిషి అవతారమెత్తితే అనేదే స్టోరీ లైన్ అని లీసుకులు వినిపిస్తున్నాయి. ఇంకా టోటల్ స్టోరీ రివీల్ కాలేదు కాని, విజయేంద్ర ప్రసాద్ అసిస్టెంట్ రైటర్ల వల్లస్టోరీ లైన్ మాత్రం లీకౌతోంది.