Rahul : శూర్పణఖ గా రకుల్ ప్రీత్ సింగ్ ..!

బాలీవుడ్ (Bollywood) స్టార్ డైరెక్టర్ (star director) నితీశ్​ తివారీ (Nitish Tiwari) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న లేటెస్ట్​ మూవీ 'రామాయణం' (Ramayanam). ఎంతో కాలంగా ఆయన తన డ్రీమ్​ ప్రాజెక్ట్​పై వర్క్​ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్​ పనులు ముగించుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.

బాలీవుడ్ (Bollywood) స్టార్ డైరెక్టర్ (star director) నితీశ్​ తివారీ (Nitish Tiwari) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న లేటెస్ట్​ మూవీ ‘రామాయణం’ (Ramayanam). ఎంతో కాలంగా ఆయన తన డ్రీమ్​ ప్రాజెక్ట్​పై వర్క్​ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్​ పనులు ముగించుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించబోయే నటులు.. ఎవరెవరు ఏయే పాత్రల్లో కనిపించనున్నారన్న విషయంపై ఇప్పటికే అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇలాంటి టైమ్‌లో ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బటయటకు వచ్చింది. ఇందులో శూర్పణఖ పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ నటించనుందన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ మోస్ట్ అవైటింగ్ మూవీలో రణ్​బీర్ కపూర్, సాయి పల్లవి సీతా రాములుగా కనిపించనుండగా.. రావణుడిగా కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్​ యశ్​, హనుమంతుడిగా బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ దేవోల్​ రోల్స్ కూడా ఫిక్సయిపోయాయి. మరోవైపు కైకేయి పాత్రలో లారా దత్తా, విభీషణుడి పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ స్టోరీలో కీలక పాత్ర అయిన సూర్పణఖ రోల్​లో ఎవరు కనిపించనున్నారన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించిన తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.. ఈ మెగా సినిమాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి అవ‌కాశం ల‌భించింద‌ని.. శూర్పణఖ పాత్రకు రకుల్ ప్రీత్‌ను ఒప్పించేందుకు చర్చలు నడుస్తున్నాయని ఓ టాక్ వినిస్తోంది.

రామాయణంలోని అత్యంత ముఖ్యమైన పాత్రలలో శూర్పణఖ పాత్ర ఒకటి.. రాముడు రావణుడిని వెతుకుతూ వెళ్లేందుకు కార‌ణం శూర్ప‌ణ‌ఖ‌.. రావ‌ణుని రెచ్చగొట్టి సీత‌ను లంక‌కు ఎత్తుకెళ్లిపోయేలా చేసిన కీల‌క పాత్రధారి శూర్పణఖ.. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఆ పాత్రలో రకుల్ అయితే సరిగ్గా సరిపోతుందని డైరెక్టర్ నితీశ్ తివారీ భావిస్తన్నాడట.. దీని కోసం ఇప్పటికే మూవీ టీమ్​ రకుల్​తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకూండా ఈ పాత్ర కోసం ఇప్పటికే రకుల్ లుక్ టెస్ట్​కు వెళ్లినట్లు సమాచారం. ఒకవేళ ఈ వార్త నిజమైతే పెళ్లి తర్వాత రకుల్ నటింటనున్న తొలి సినిమా ఇదే కావొచ్చని భావిస్తున్నారు. అయితే.. ఈ విషయంపై రకుల్ ఫ్యాన్స్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శూర్పణఖగా రకుల్ (Soorpanakhaga Rakul) అదరగొడుతుందని కొందరు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరేమో రకుల్ రిస్క్ చేస్తుందేమో అంటున్నారు.. మరి ఇంతకీ ఈ వార్తలో ఎంత నిజముందో మూవీ టీమ్ స్పందించేవరకు ఓ క్లారిటీ రాదు..