రకుల్ ప్రీత్ ని టాలీవుడ్ లో మోసం చేసారా…? సంచలన విషయాలు

టాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతుందని భావించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆమె అందానికి హైట్ కి టాలీవుడ్ లో ఒకానొక సమయంలో భారీ ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోల సరసన ఆమె సరిగా సరిపోతుందని కచ్చితంగా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలగడం ఖాయం అని అంచనాలు వేసారు.

  • Written By:
  • Publish Date - October 14, 2024 / 08:27 PM IST

టాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతుందని భావించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆమె అందానికి హైట్ కి టాలీవుడ్ లో ఒకానొక సమయంలో భారీ ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోల సరసన ఆమె సరిగా సరిపోతుందని కచ్చితంగా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలగడం ఖాయం అని అంచనాలు వేసారు. కాని అనూహ్యంగా ఆమెను వరుస ఫ్లాప్ లు ఇబ్బంది పెట్టాయి. టాలీవుడ్ నుంచి కనుమరుగై బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసినా పెద్దగా ఛాన్స్ లు రాలేదు. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి ఆమె పెళ్లి చేసుకుంది.

టాలీవుడ్ లో ఆమెపై కుట్ర జరిగిందని డ్రగ్స్ వ్యవహారంలో ఆమెను కావాలని కొందరు లాగే ప్రయత్నం చేసారని వార్తలు కూడా వచ్చాయి. ఇక డ్రగ్స్ కేసు ఎప్పుడు బయటకు వచ్చినా ఆమె పేరు ఆమె సోదరుడి పేరు ఎక్కువగా మీడియాలో హడావుడి అయ్యేది. చేసిన పాపం కంటే ప్రచారం ఎక్కువ అన్నట్టు ఆమె చేసిందో లేదో తెలియదు గాని ఆమెను అయితే కొందరు గట్టిగానే టార్గెట్ చేసారు. దానికి తోడు రాజకీయ నాయకులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయనే వార్తలు కూడా గట్టిగానే వచ్చాయి.

వీటిన్నిటి మధ్య నుంచి రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలకు గుడ్ బై చెప్పింది. వెబ్ సీరీస్ ల్లో చేస్తుందనే వార్తలు వచ్చినా అవి నిజం కాదని తెలిసింది. ఇక ఇటీవల తెలంగాణా మంత్రి ఒకరు ఆమె లక్ష్యంగా ఆరోపణలు చేసారనే ప్రచారం జరిగింది. మాజీ మంత్రి కేటిఆర్ లక్ష్యంగా చేసిన కొన్ని ఆరోపణల్లో రకుల్ ప్రీత్ గురించి కూడా కొన్ని ఉన్నాయని వార్తలు వచ్చాయి. దీనిపై రకుల్ ప్రీత్ కూడా స్పందించారు. అయితే ఆమె అనవసరంగా స్పందించారని కొందరు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు తాజాగా ఈ మాజీ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తాను టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో ఒక సినిమాలో నటించాను అని చెప్తూ సంచలన విషయమం బయటపెట్టింది. కాని తనకు ఏ విధమైన సమాచారం లేకుండా ఆ సినిమా నుంచి తనను పక్కన పెట్టారని ఆమె చెప్పింది. అలా చేయడంతో చాలా బాధ పడ్డాను అని కూడా చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ సరసన ఒక సినిమాలో ఛాన్స్ వస్తే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అని షెడ్యూల్ ప్రకారం షూట్ కూడా చేసారు అని… తర్వాత మాత్రం తనకు ఏ ఫోన్ కాల్ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తర్వాత తన స్థానంలో కాజల్ ను తీసుకున్నారని… హిట్ జోడీ కాబట్టి వారిని తీసుకున్నారని ఆమె చెప్పుకొచ్చింది.