SS Rajamouli: ఆస్కార్‌లో సభ్యత్వం.. రాజమౌళికి మిస్సైంది.. ఎందుకు..?

అకాడమీ అవార్డ్స్ వాళ్లు రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్, సాబుసిరిల్‌కి ఆస్కార్ కమిటీలో సభ్యత్వం ఇచ్చారు. అంటే నెక్ట్స్ ఇయర్ ఎవరికి ఆస్కార్ రావాలో నిర్ణయించే కమిటీలో వీళ్లకు సభ్యత్వం దక్కింది. ఇదో అరుదైన గౌరవం.

  • Written By:
  • Publish Date - June 29, 2023 / 05:44 PM IST

SS Rajamouli: ఆస్కార్ స్టేజ్ మీద నాటు నాటు పాట సందడి చేశాక, కీరవాణి, చంద్రభోస్‌కి అవార్డు రావటం ఎన్నటికీ మర్చిపోలేని ఙ్ఞాపకం. ఓ రకంగా ప్రౌడ్ మూవ్‌మెంట్. ఐతే ఇప్పడు కొత్తగా అకాడమీ అవార్డ్స్ వాళ్లు రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్, సాబుసిరిల్‌కి ఆస్కార్ కమిటీలో సభ్యత్వం ఇచ్చారు.

అంటే నెక్ట్స్ ఇయర్ ఎవరికి ఆస్కార్ రావాలో నిర్ణయించే కమిటీలో వీళ్లకు సభ్యత్వం దక్కింది. ఇదో అరుదైన గౌరవం. ఇది దక్కడమంటే హాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు దక్కినట్టే. అలాంటి గుర్తింపు రామ్ చరణ్, ఎన్టీఆర్‌కి దక్కింది. కీరవాణి, చంద్రబోస్‌కి దక్కింది. ఆఖరికి సినిమాటోగ్రాఫర్ సెంథిల్, ప్రొడక్షన్ డిసైనర్ సాబూ సిరిల్‌కి కూడా దక్కింది. కాని త్రిబుల్ ఆర్ తీసిన దర్శకుడు రాజమౌళికి మాత్రం దక్కలేదు. విచిత్రం ఏంటేంటే బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్, కోలీవుడ్ దర్శకుడు మణిరత్నంకి కూడా ఆహ్వానం అందింది. ఎందుకలా? ఇక్కడ విచిత్రం ఏంటంటే బాహుబలి, త్రిబుల్ ఆర్‌తో ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన రాజమౌళికి ఆస్కార్ కమిటీలో సభ్యత్వం పెద్ద సమస్య కాదు. తనకి రావొచ్చు.

కాని సభ్యత్వం వస్తే, ఆస్కార్ అవార్డుల నామినేషన్ టైంలో కనీసం 3 నెలలు దాదాపు 300లకు పైగా సినిమాలు చూసి, తమ అభిప్రాయాన్ని ఓట్లరూపంలో పంపించాలి. ఇక్కడ చెర్రీ, తారక్ అండ్ కో అందరూ అంత టైం వెచ్చించే ఛాన్స్ ఉంది. కాని మహేశ్‌తో మూవీ తీయబోతున్న రాజమౌళి అంత టైం కేటాయించే పరిస్థితి లేదు. ఎందుకంటే జనవరి నుంచే మహేశ్ మూవీ షూటింగ్ కాబట్టి, తను ఇంట్రస్ట్ చూపించలేదట. తనే ఆస్కార్ కమిటీ సభ్యలకు తన నిరాశక్తిని చెప్పాడట. ఇది జక్కన్నకు ఆస్కార్ కమిటీలో సభ్యత్వం రాకపోవటానికి అసలు కారణం అంటున్నారు.