RAM CHARAN-Jr NTR: త్రిబుల్ ఆర్‌తో వచ్చిన క్రేజ్, ఇమేజ్ ఇంకిపోతున్నాయా..?

రామ్‌గా.. రామ్ చరణ్‌కి, భీముడిగా.. తారక్ కి పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఇంత క్రేజ్, ఇమేజ్ వచ్చాక నెక్ట్స్ మూవీ గట్టిగానే ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి, చరణ్ శంకర్ మేకింగ్‌లో గేమ్ ఛేంజర్ కమిటయ్యాడు. తారక్.. కొరటాల శివ మేకింగ్‌లో దేవర మూవీ చేస్తున్నాడు.

  • Written By:
  • Updated On - February 19, 2024 / 05:24 PM IST

RAM CHARAN-Jr NTR: రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఓ సినిమా చేయటమే వింత. అది కూడా బాహుబలి మూవీతో హిస్టరీ క్రియేట్ చేసిన రాజమౌళితో. అచ్చంగా అదే జరిగింది. అలా త్రిబుల్ ఆర్ వచ్చి మరోసారి చరిత్ర సృష్టించింది. సినిమాలో పాటకు ఆస్కార్ కూడా వచ్చింది. దీనికి తోడు రామ్‌గా.. రామ్ చరణ్‌కి, భీముడిగా.. తారక్ కి పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఇంత క్రేజ్, ఇమేజ్ వచ్చాక నెక్ట్స్ మూవీ గట్టిగానే ప్లాన్ చేసుకోవాలి.

TSPSC GROUP 1: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు.. కొత్త నోటిఫికేషన్ ఎప్పుడంటే..

కాబట్టి, చరణ్ శంకర్ మేకింగ్‌లో గేమ్ ఛేంజర్ కమిటయ్యాడు. తారక్.. కొరటాల శివ మేకింగ్‌లో దేవర మూవీ చేస్తున్నాడు. శంకర్ మేకింగ్‌లో చరణ్ సినిమా అంటే సీన్ మారిపోవాల్సిందే అనుకున్నారు. కాని ఇయర్లు మారిపోతున్నాయి. ఐనా గేమ్ ఛేంజర్ పూర్తికాలేదు. ఇక రెండు కథల్ని పక్కన పెట్టించి మరీ దేవర మూవీని పట్టాలెక్కిస్తే, కొరటాల శివ షూటింగ్‌ని పూర్తిచేయలేకపోతున్నాడు. మధ్యలో సైఫ్ ఆలీ ఖాన్ గాయంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇలా కారణాలు ఏవైనా దేవర మూవీ షూటింగ్ చాలా డిలే అయ్యింది. ఏప్రిల్‌లో రావాల్సిన సినిమా అక్టోబర్‌కి షిఫ్ట్ అయ్యింది. కనీసం ఈసినిమా ఎప్పుడొస్తుందో క్లారిటీ ఉంది. అయితే, గేమ్ ఛేంజర్‌కి ఆక్లారిటీ కూడా లేదు. ఈలోపు త్రిబుల్ ఆర్‌తో వచ్చిన క్రేజు, మార్కెట్‌లో మైలేజ్ తగ్గేలా ఉన్నాయి.

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలంటారు. అలానే త్రిబుల్ఆర్‌తో వచ్చిన క్రేజ్.. నార్త్‌తోపాటు, మిగతా సదరన్ స్టేట్స్‌లో మార్కెట్‌గా మారాలంటే మరో సాలిడ్ పాన్ ఇండియా హిట్ పడాలి. అది కూడా సాధ్యమైనంత త్వరగా. కాని గేమ్ ఛేంజర్, దేవర లేటవుతున్న కొద్ది వీళ్లకొచ్చిన క్రేజ్‌లో మైలేజ్ కూడా తగ్గేలా ఉంది.