సూపర్ స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ .. ఇలా ఈ ఇద్దరు స్టార్ల కండలకి వాస్తు దోషం వచ్చినట్టుంది. పరిహారం కోసం పరాయి దేశం వెళ్లారిద్దరు. ఒకరు కేనడా, దుబాయ్ లో కండల వాస్తు దోశం సరిదిద్దుతుంటే, ఆస్ట్రేలియాలో అసలైన పరిహారం ఉందంటున్నారు రామ్ చరణ్. విచిత్రం ఏంటంటే ఇద్దరి సినిమాలు ఇంకా మొదలవ్వలేదు. కాని ఈలోపే జిమ్ లో కండల యుద్దం మొదలు పెట్టారు. తెగ కష్టపడుతున్నారు. ఇంత కష్టం దేనికి…ఆల్రెడీ చరణ్ కి త్రిబుల్ ఆర్, ఆచార్య, గేమ్ ఛేంజర్ కోసం పెంచిన కండలున్నాయి… అయినా సరిపోలేదా అంటే, అక్కడే వాస్తు దోషం వెంటాడుతోందట. ఈ విషయంలో నెల ముందునుంచే కండలకొచ్చిన వాస్తుదోశాన్ని కెనడా, దుబాయ్ లో పరిహారం చెల్లిస్తున్నాడు సూపర్ స్టార్.. అదేంటో చూసేయండి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈనెల బిగినింగ్ లో ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆల్రెడీ సూపర్ స్టార్ మహేశ బాబు కెనడా వెళ్లొచ్చాడు. దుబాయ్ ట్రిప్ లో కండల కోసం కసరత్తులు చేశాడు. ఇదంతటికీ కారనం వీళ్ల కండలకి వాస్తు రిపేర్లు జరగటమే.. నిజంగా ఇది నిజం ఎందుకంటే చరణ్, మహేశ్ బాబు డైయిలీ జిమ్ చేసే స్టార్స్… పర్ఫెక్ట్ ఫిజిక్ ని మేయింటేన్ చేస్తారు. రామ్ చరణ్ అయితే త్రిబుల్ ఆర్ కోసం, ఆచార్యకోసం కండలు పెంచాడు. గేమ్ ఛేజంర్ లో కూడా తన కండల లుక్ కంటిన్యూ చేశాడు. సో తను కొత్తగా ఏదోమూవీకోసం కండలు పెంచాల్సిన పనిలేదు. కాని బుచ్చి బాబు మేకింగ్ లో తను చేయబోయే సినిమా పెద్ది కోసం అంతర్జాతీయ అథ్లెట్స్ ట్రైనర్ దగ్గర కఠోర శ్రమ పడుతున్నాడు.
రియల్ అథ్లెట్ స్టోరీతో ఓ ఫిక్షనల్ మూవీ తీయబోతున్న బుచ్చి బాబు క్రియేట్ చేసిన పాత్ర కోసమే తన లుక్ మార్చుకుంటున్నాడు చరణ్. ఇందులో తన థైస్ ధ్రుడంగా బలంగా ఉండేందుకు సైక్లింగ్, రన్నింగ్ చేస్తున్నాడట. త్రిబుల్ ఆర్ లో చరణ్ బైసెప్స్ బలంగా ఉంటే, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ థైస్ స్ట్రాంగ్ గా ఉంటాయి.. పాత్రల అవసరాల మేకరు అలాంటి లుక్ తప్పదు. అందుకే రామ్ చరణ్ ఓ అథ్లెట్ లుక్ కోసం తెగ కష్పడుతున్నాడు. ఇక రాజమౌళి మూవీకోసం సూపర్ స్టార్ ఆల్రెడీ రెండు నెలల ట్రైనింగ్ ని కెనెడాలో తీసుకున్నాడు. దుబాయ్ లో కూడా కండల కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఆల్రెడీ ఫిట్ గా ఉండే మహేశ్ కండలు పెంచాలంటే, ఇక్కడ ట్రైనింగ్ సరిపోదా అన్నడౌట్ రాకుండా ఉండదు. కాని కండలు పెంచే ప్రాసెస్ లో కొన్ని సార్లు ముఖం చిక్కిపోతుంది…లుక్ డల్ అవుతుంది.. అలా కాకుండా ముఖంలో ఎలాంటి మార్పు రాకుండా, జాగ్రత్తగా మజిల్స్ లో మార్పులు తెచ్చుకునేందుకు, ఇలా ఎక్స్ పర్టీస్ ట్రైనింగ్ లో కండలు క్రమబద్దంగా పెంచేస్తున్నారు స్టార్స్