RAM CHARAN: క్లీంకారా కనిపించిందోచ్‌.. వైరల్ అవుతున్న ఫొటోలు..

రీసెంట్‌గా సోషల్ మీడియాలో క్లీంకారా ఫోటో ఇదే అంటూ పిక్చర్ బాగా వైరల్ అయింది. ఆ మధ్య ఫ్యామిలీ గ్యాదరింగ్ అప్పుడు.. స్విమ్మింగ్‌పూల్‌లో రిఫ్లెక్షన్ ఫొటోను.. ఫ్యాన్స్ తెగ వైరల్ చేశారు. ఐతే క్లీంకారా ఫొటో ఇదే అంటూ.. ఇప్పుడు మరో పిక్‌ను అభిమానులు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - March 13, 2024 / 05:05 PM IST

RAM CHARAN: మెగాపవర్ రామ్‌చరణ్‌ కూతురు క్లీంకారా ఎలా ఉంటుందని అభిమానులు ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు. మెగా ప్రిన్సెస్ ఫొటోను.. చెర్రీ కానీ, ఉపాసన కానీ.. ఇప్పటివరకు రివీల్ చేయలేదు. క్లీంకారా పుట్టి 8నెలలు దాటిపోతుంది. ఐనా సరే.. ఇంకా ఆమెకు సంబంధించిన ఫోటోను రిలీజ్ చేయకపోవడంతో.. ఫాన్స్ పిక్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఐతే తమ ఫేవరెట్ హీరో కూతురు ఫోటో చూడాలని.. ప్రతీ అభిమాని కూడా కలలు కంటూ ఉంటాడు.

Poonam Kaur: కనికరం లేదా..? షర్మిలపై పూనం కౌర్‌ సంచలన కామెంట్స్‌

రీసెంట్‌గా సోషల్ మీడియాలో క్లీంకారా ఫోటో ఇదే అంటూ పిక్చర్ బాగా వైరల్ అయింది. ఆ మధ్య ఫ్యామిలీ గ్యాదరింగ్ అప్పుడు.. స్విమ్మింగ్‌పూల్‌లో రిఫ్లెక్షన్ ఫొటోను.. ఫ్యాన్స్ తెగ వైరల్ చేశారు. ఐతే క్లీంకారా ఫొటో ఇదే అంటూ.. ఇప్పుడు మరో పిక్‌ను అభిమానులు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. ఈ ఫొటోలో క్లీంకారాను ఉపాసన కాళ్ల మీద కూర్చోబెట్టుకొని ఉంటుంది. పాప అచ్చూ రామ్‌చరణ్‌లానే ఉందంటూ మెగా అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. ఐతే ఈ పిక్‌ మీద రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఐతే ఇది మార్ఫ్ చేసిన ఫొటో అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఇవి క్లీంకారా ఫొటోనే అంటూ ధీమాగా చెప్తున్నారు.

ఫొటో నిజమా.. కాదా.. అందులో ఉన్నది క్లీంకారేనా అన్న సంగతి ఎలా ఉన్నా.. ఆ ఫొటోలో పాప మాత్రం చాలా క్యూట్‌గా ఉంది. ఇక అటు కెరీర్‌పరంగా రాంచరణ్‌ చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా.. ఆ తర్వాత లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మరొక సినిమాకి కమిట్ అయ్యాడు.