Ram Charan: రామ్ చరణ్ తన వైఫ్ ఉపాసనతో అర్జెంట్‌గా పారిస్ వెళ్లటానికి సాలిడ్ రీజన్ ఉంది. అసలే హైద్రబాద్‌లో వర్షాలు, దాంతో వెదర్ మారి చల్లగా అయిపోయింది. ఇలాంటి టైంలో పారిస్‌కి పయనం అంటే అర్ధం లేదు. బేసిగ్గా సమ్మర్‌లో యూరప్ వెకేషన్ వెళ్లటం చూస్తాం. కాని చరణ్ పారిస్ కివెళ్లటానికి ఒకే ఒక్క కారణం డైరెక్టర్ శంకర్. అసలు వెకేసన్‌కి వెళ్లాలనే ఆసక్తి చరణ్‌కి లేదట. కాకపోతే గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇంకా షురూ కాకపోవటం, పెండింగ్ షూటింగ్‌కి సరైన షెడ్యూల్స్ లేకపోవటంతో చరణ్ ఇరిటేట్ అవుతున్నాడట.
శంకర్ కూడా భారతీయుడు సీక్వెల్‌ని సీరియల్‌లా సాగతీస్తూనే, గేమ్ ఛేంజర్‌ని గాలికొదిలేసినట్టు ప్రవర్తించటం దిల్ రాజుని కూడా ఇబ్బంది పెడుతోంది. ఖాళీగా ఉంటే ఏం చేయాలో తోచదు. ఇప్పట్లో మరో మూవీ కమిటయ్యే పరిస్థితి లేదు. బుచ్చి బాబు మూవీ చేద్దామా అంటే శంకర్ మూవీ గేమ్ ఛేంజర్ షెడ్యూల్ ఎప్పుడు మళ్లీ మొదలౌతుందో క్లారిటీ లేదు. కాబట్టి గేమ్ ఛేంజర్ మూవీ పూర్తయ్యే వరకు బుచ్చిబాడు సినిమా హోల్డ్‌లో ఉండాలి. మరి ఈ ఖాళీ టైంలో ఏం చేయాలి..? ఇక్కడ ఇంట్లో ఖాలీగా ఉన్నా కష్టమే..! షూటింగ్స్ లేక కాల్ షీట్స్ వేస్ట్ అవటం తప్ప మరేం లేదు. అందుకే ఏం తోచక అటు ఫ్యామిలీతో గడిపినట్టుందని పారిస్ టూర్ ప్లాన్ చేసుకున్నాడట. మహేశ్ బాబు కూడా త్రివిక్రమ్ వల్లే చాలా సార్లు లండన్, దుబాయ్ అంటూ ట్రిప్పులేశాడు. గుంటూరు కారం కథ సరిగా లేక, రిపేర్లకు టైం తీసుకోవడం.. ఇలా చాలా బ్రేకులు పడ్డాయి.
అలా బ్రేకులు పడటంతో మహేశ్ ఆ ఖాళీ టైంలో విదేశాలకు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. నిజానికి సినిమా అయిపోయాక అతి కష్టం మీద ఏడాదికి ఒకసారి ఫ్యామిలీతో వెకేషన్ కెళ్లే మహేశ్ కూడా.. ఈ ఏడాది మాత్రం వెకేషన్ల మధ్యలో షూటింగ్ చేయాల్సి వచ్చింది. సీన్ రివర్స్ అయ్యింది. ఇటు త్రివిక్రమ్, అటు శంకర్ పని తీరు ఇలా ఉంది కాబట్టే హీరోలు సెట్లో కంటే వెకేషన్‌లోనే ఎక్కువ ఉండాల్సి వస్తోంది.