Ram Charan: సినిమాల్లో అయినా, పాలిటిక్స్‌లో అయినా ప్రతిభతోపాటు ప్రమోషన్ కూడా చాలా ముఖ్యం. లైఫ్‌లో తనని తాను ప్రమోట్ చేసుకున్నవాడే గొప్పోడు అవుతాడు. ఆ విషయం చంద్రబాబు నుంచి రాజమౌళి వరకు అందరూ నిరూపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాంచరణ్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు. చెర్రీని హీరోగా మలచడానికి చిరంజీవి పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. యాక్టింగ్, హార్స్ రైడింగ్ మొదలైనవన్నీ ట్రైనింగ్ ఇప్పించారు. చిరు దగ్గరుండి డైరెక్టర్స్, స్టోరీస్ సెలెక్ట్ చేయడంతో పాటు ఇండస్ట్రీలో ఎదగడానికి పాజిటివ్ యాటిట్యూడ్ ఎంత అవసరమో చెప్పి రాం చరణ్‌ని తీర్చి దిద్దారు. చిరు కుటుంబం చెర్రీని అన్ని రకాలుగా తీర్చిదిద్దింది.
హార్డ్‌వర్క్‌తో ఫిజిక్, నటన, ఆలోచనా విధానం, యాటిట్యూడ్ అన్ని మార్చుకున్నాడు రాం చరణ్. భార్య ఉపాసన వచ్చిన తరువాత చెర్రీ లైఫ్‌లో రెండో ఇన్నింగ్స్ మొదలైంది. అతన్ని జాతీయ స్థాయిలో ఒక ఐకాన్‌గా నిలబెట్టడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ చేస్తున్నారు. రాంచరణ్ తనకున్న ప్రతిభతోపాటు, సాఫ్ట్ యాటిట్యూడ్‌తో అందరినీ ఆకట్టుకోగలిగాడు. ఇది కూడా ఉపాసన టీమ్ ప్రమోషన్‌లో భాగమే. ప్రధాని మోదీతో భేటి, బాలీవుడ్ స్టార్స్‌తో మీటింగ్స్, ఇండియా టుడే కాంక్లేవ్‌తోపాటు, జీ20 సదస్సులో పాల్గొనడం వంటివి చేశాడు. అసలు రాం చరణ్‌కు ఎందుకు ఇంత డిమాండ్ అని జనం ఆశ్చర్య పోతున్నారు. అసలు చెర్రీ ఏం చేశాడని ఇంత పెద్ద పెద్ద వేదికలపై చోటు దక్కుతుందో జనానికి అర్థం కావడం లేదు. కానీ ఇదంతా చిరంజీవి, ఉపాసన డిజైన్ చేస్తున్న కార్పొరేట్ ప్రమోషన్ స్ట్రాటజీ. ఒక సాదా సీదా వ్యక్తిని ఐకాన్ పర్సనాలిటీగా డిజైన్ చేయడం ఎలాగో చూడాలంటే రాంచరణ్ కథ ఒక ఉదాహరణ. చెర్రీ ఒక్కడే కాదు జగన్, చంద్ర బాబు ఇలాగే ప్రమోషన్ స్ట్రాటజీ తోగొప్ప వాళ్ళుగా మారిపోయారు.
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రామ్‌చరణ్, ఎన్టీఆర్ హాలీవుడ్ రేంజ్‌లో ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఆస్కార్‌కు ముందుగానీ, తర్వాత గానీ.. రామ్‌చరణ్ పేరు ఎక్కువగా వినిపించిది. ఆస్కార్‌లోనే కాదు.. ఇండియాలోనూ సందడంతా చెర్రీదే. గ్లోబర్ ఇమేజ్‌ను క్యారీ చేయడానికి అవకాశాలను పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. లేటెస్ట్‌గా కశ్మీర్‌లో జరిగిన జీ 20 సదస్సుకు భారతీయ సినిమా పరిశ్రమ ప్రతినిధిగా పాల్గొనే అరుదైన ఛాన్స్ ఈ మెగా హీరో సొంతమైంది. ఎన్టీఆర్ బాగా మాట్లాడతాడని పేరుంది. అయితే రామ్‌చరణ్ స్పీచ్ అభిమానులనే కాదు.. ఇండియన్స్‌ను ఇంప్రెస్ చేసేసింది. దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జె.బోక్‌తో కలిసి చరణ్ నాటు నాటుకు స్టెప్పులేసి అలరించారు.
చెర్రీ మాట్లాడుతూ.. “నార్త్, సౌత్ అని రెండు రకాల సినిమాలు లేవు. వున్నదల్లా భారతీయ సినిమా ఒక్కటే. ఇప్పుడది గ్లోబర్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇండియాలో ఎన్నో అందమైన లొకేషన్లు వున్నాయి. నేను నటించే సినిమాల షూటింగ్స్ ఇండియాలోనే ఎక్కువ శాతం జరపాలని కోరుకుంటా. విదేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. హాలీవుడ్ మూవీస్‌లో నటించినా.. వాళ్లనూ ఇక్కడే షూట్ చేయమని షరతు పెడతాను” అన్నాడు రామ్‌చరణ్. ఆర్‌ఆర్‌ఆర్‌కు వచ్చిన ఆస్కార్‌తో టీమ్ అందరూ లాభపడినవారే. అయితే ప్లాన్డ్‌గా ఎక్కువ పేరు సంపాదించింది మాత్రం రామ్‌చరణే.
ఆస్కార్ వేడుకకు అందరికంటే ముందే అమెరికా వెళ్లి.. తనని తాను ప్రమోట్ చేసుకున్నాడు రామ్‌చరణ్.
హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుతోపాటు మరిన్ని అవార్డులు తీసుకున్నాడు. గుడ్ మార్నింగ్ అమెరికాలో ముఖ్య అతిథిగా పాల్గొనే అరుదైన అవకాశంతో అందరి దృష్టిలో పడ్డాడు చెర్రీ. ఆస్కార్ టూర్‌ను బాగా యూజ్ చేసుకునేలా.. హాలీవుడ్ తన వైపు చూసేలా పక్కా ప్లానింగ్‌తో అడుగులేశాడు. హాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. పాన్ ఇంటర్నేషనల్ మూవీ చేయాలన్న డ్రీమ్ కోసం.. మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ హాలీవుడ్‌కు కనెక్ట్ అయ్యాడు చెర్రీ. ఆస్కార్ పేరుతో అమెరికాలోనే కాదు ఇండియాలోనూ పొలిటికల్‌గా పావులు కదిలిపారు మెగా హీరోలు. చక్కని పొలిటికల్ ప్లానింగ్‌తో జీ 20 సదస్సులో పాల్గొనే అవకాశం దక్కించుకోవడానికి అమిత్‌షాతో భేటీ ఉపయోగపడిందనే చెప్పాలి. ఆస్కార్ వేడుకల తర్వాత హైదరాబాద్‌లో దిగకుండా నేరుగా ఢిల్లీ వెళ్లి, ఇండియా టుడే కాంక్లేవ్ 2023లో పాల్గొన్నారు. అమిత్‌షా తండ్రీకొడుకులను సత్కరించారు. ఆస్కార్ వేడుక రామ్‌చరణ్‌కు గ్లోబల్ ఇమేజ్‌తోపాటు పొలిటికల్ ఇంపార్టెన్స్ కూడా తీసుకొచ్చింది. మున్ముందు ఎలాంటి ప్లాన్స్‌తో దూసుకుపోతాడో చూడాలి మరి.
రామ్‌చరణ్‌లా దూసుకుపోవడంలో ఎన్టీఆర్ వెనుక పడ్డాడనే చెప్పాలి. ఆర్ఆర్‌ఆర్‌లో తనదైన యాక్టింగ్ స్కిల్స్‌తో హాలీవుడ్ సెలబ్రిటీస్‌ను మెప్పించాడు. ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ సిరీస్ దర్శకుడు జేమ్స్ గన్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుందన్నాడు. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ మూడో భాగం ప్రమోషన్‌లో ‘గెలాక్సీ ప్రపంచంలోకి ఎవరైనా ఇండియన్ యాక్టర్‌ను తీసుకోవాలనుకుంటే.. ఎవరిని ఎంచుకుంటారని అడిగితే.. ఎన్టీఆర్ పేరు చెప్పకుండానే.. తెలివిగా సమాధానం చెప్పాడు. ఆర్‌ఆర్‌ఆర్‌లో అడవి మృగాలతో జంప్ చేసిన హీరోను తీసుకుంటానన్నాడు. హాలీవుడ్ మేకర్స్‌ను ఎన్టీఆర్ ఇంప్రెస్ చేసినా.. తనని తాను ప్రమోట్ చేసుకోవడంలో ఆసక్తి చూపించలేకపోయాడు. అవకాశాలు క్రియేట్ చేసుకోడంలో ఫెయిల్ అయ్యాడు. పొలిటికల్‌గా తెలుగుదేశంతో వున్నట్టు చెప్పలేడు. అలా అని దూరంగా వుండలేడు. నందమూరి ఫ్యామిలీతో కలవలేకపోతున్నాడు. రీసెంట్‌గా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు డుమ్మా కొట్టి నందమూరి ఫ్యాన్స్‌కు మరింత దూరమయ్యారు. గతంలో తారక్ అమిత్‌షాతో భేటీ అయినా.. జీ 20 సదస్సులో భారతీయ సినిమా పరిశ్రమ ప్రతినిధిగా వెళ్లే ఛాన్స్ రామ్‌చరణ్‌ను వరించింది. జూనియర్ ఒంటరి ఐపోయాడు. టీడీపీ కానీ, కమ్మ వాళ్ళు కానీ అతనికి సహకరించరు. చుట్టూ పెద్ద వ్యూహకర్తలు ఉండరు. దీంతో రాంచరణ్ ఎక్కడికో వెళ్లి పోతే జూనియర్ ఇక్కడే ఆగిపోయాడు. టాలెంట్ మాత్రమే కాదు ప్రమోషన్ చేసుకునే ప్లాన్, టీమ్ కూడా అవసరం మరి.