దేవర లానే కష్టాలు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ కి మించి గొడవలు…

దేవర రిలీజై రికార్డులు క్రియేట్ చేసింది కాబట్టిసరిపోయింది. లేదంటే దేవర ఏమాత్రం అటు ఇటైనా, కామెంట్లు, ట్రోలింగ్ చేసిన బ్యాచ్ నోటికి చిక్కినట్టే అయ్యేది. అంతగా ఎన్టీఆర్ మీద నార్త్ లో గ్రూప్ గా ఏర్పడిన బ్యాచ్ ట్రోలింగ్ చేసింది. అలాంటి బ్యాచ్ కి ఇప్పుడు ఎన్టీఆర్ దోస్త్ రామ్ చరణ్ ఈజీగా దొరికిపోయాడు.

  • Written By:
  • Publish Date - November 22, 2024 / 05:56 PM IST

దేవర రిలీజై రికార్డులు క్రియేట్ చేసింది కాబట్టిసరిపోయింది. లేదంటే దేవర ఏమాత్రం అటు ఇటైనా, కామెంట్లు, ట్రోలింగ్ చేసిన బ్యాచ్ నోటికి చిక్కినట్టే అయ్యేది. అంతగా ఎన్టీఆర్ మీద నార్త్ లో గ్రూప్ గా ఏర్పడిన బ్యాచ్ ట్రోలింగ్ చేసింది. అలాంటి బ్యాచ్ కి ఇప్పుడు ఎన్టీఆర్ దోస్త్ రామ్ చరణ్ ఈజీగా దొరికిపోయాడు. అయ్యప్ప మాల వేసుకుని దర్గా దర్శనాలేందని భారీ ఎత్తున విమర్శలు పెరిగాయి. తన వైఫ్ ఉపాసన, అందరి ధర్మాలను గౌరవిద్దాం అంటూ మెగా పవర్ స్టార్ కి సపోర్ట్ ఇచ్చినా నో యూజ్… నార్త్ ఇండియాలో మాడ్రన్ రాముడిగా చరణ్ కి త్రిబుల్ ఆర్ తో కొంత గుర్తింపు దక్కింది. ఇప్పుడా క్రేజ్, ఇమేజ్ కాంట్రవర్సీకి చిక్కింది. చిలికి చిలికి గాలి వాన కాస్త తుఫాన్ లా మారుతోంది. ఇది కంటిన్యూ అయితే, దేవరని ట్రోలింగ్ గేమ్ ఛేంజర్ కి తప్పదా..?

దేవర రిలీజ్ కిముందు, రిలీజ్ తర్వాత, ఆఖరికి ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న టైంలో కూడా, ఇలా ప్రతీ సారి పురిటినొప్పులు తప్పలేదు. ఏదో సౌత్, నార్త్ లో ఎన్టీఆర్ కి భయంకరంగా మాస్ లో ఫ్యాన్ బేస్ ఉండే సరికి, దేవర మీద నెగెటివిటి ఎంత స్ప్రెడ్ చేసినా దేవర వసూళ్లకి ఎవరూ కళ్లెం వేయలేకపోయారు

కట్ చేస్తే ఇందుకు పూర్తి భిన్నమైన స్టోరీ రామ్ చరణ్ ది.. తను ఎన్టీఆర్ మంచి స్నేహితులే.. కాని మ్యాన్ ఆఫ్ మాసెస్ రేంజ్ లో చరణ్ కి మాస్ ఫాలోయింగ్ లేదు. మెగా ఫాలోయింగ్ ఉన్నా కాని, త్రిబుల్ ఆర్ తర్వాత ఆచార్య పంచ్ ఇవ్వకుండా ఉండలేదు.

అసలే శంకర్ భారతీయుడు 2 లా గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏమౌతుందో అన్న టెన్షన్ ఒకవైపు, సంక్రాంతికి పోటీకొస్తున్న బాలయ్య, వెంకీ సినిమాలతో పాటు అజిత్ మూవీతో సౌత్ మార్కెట్ లో ఇబ్బందులు మరో వైపు… ఎగ్జాక్ట్ గా ఇలాంటి టైంలో అటు ఎన్టీఆర్ దేవరగా రికార్డులు క్రియేట్ చేశాడు. మెగా కజిన్ పుష్ప 2 తో వస్తున్నాడు

ఇవన్నీ తనకి పోటీ ఇచ్చే అంశాలైతే, తను దర్గా దర్శనంతో వివాదాల్లో చిక్కుకున్నాడు. స్వామి మాల వేసుకుని దర్గాకెళ్లటం ఏంటని నార్త్ ఇండియా నుంచి కామెంట్ల దాడి పెరిగింది. తన వైఫ్ ఉపాసన కూడా అన్ని మతాల ను గౌరవిద్దం అన్నా ఎవరూ ఊరుకోవట్లేదు

పొరుగు మతాలను గౌరవించాలంటే, ఇలా స్వామిమాల వేసుకుని దర్గా దర్శనంకివెళ్లాలా అనంటున్నారు. అసలే త్రిబుల్ ఆర్ లో రాముడి గెటప్ లో సింగిల్ సీన్ లో కనిపించి, ఇన్ స్టెంట్ గా మెగా రాముడిగా నార్త్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు చరన్. అలా అప్పుడు మెచ్చుకున్నవాళ్లే, ఇప్పడు బాగా హార్ట్ అయినట్టున్నారు

ఎవరి మతాన్నైనా, నమ్మకాలనైనా గౌరవించాల్సిందే.. కాకపోతే చరణ్ మామూలుగా కడప దర్గాలో ప్రార్థన చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కాని తను అయ్యప్ప మాల వేసుకుని ఇలా దర్గా లో ప్రార్థనలు చేయటమే చాలా మందికి నచ్చలేదు. కాని చరణ్ మాత్రం ఏం చేస్తాడు ఏఆర్ రెహమాన్ గజల్స్ కి అతిదిగా వస్తానని మాట ఇచ్చాడు కాబట్టి వెళ్లాడు. తను మాల వేసుకున్నాడని తర్వాత వెళ్లాలంటే, రెహమాన్ కార్యక్రమం వాయిదా పడదు… ఇది మొత్తానికి మెగా హీరో మీద పెరిగిన ప్రశ్నల వర్షానికి కారణం.