ఆస్కార్ ఈవెంట్ తరువాత ఇండియాకు వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్.. చరణ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. బిజీబిజీగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇలా రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాజమౌళి గురించి తన భార్య ఉపాసన గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు చెర్రీ. నా విషయంలో రాజమౌళి, ఉపాసన ఇద్దరూ ఒకేలా బిహేవ్ చేస్తారంటూ చెప్పాడు. నాటు నాటు సాంగ్ గురించి మాట్లాడుతూ.. ఆ సమయంలో తాను పడ్డ కష్టాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఆ క్షణాలు తలుచుకుంటే ఇప్పటికీ తన కాళ్లు వణుకుతాయని చెప్పాడు. నాటు నాటు సాంగ్‌లో హీరోల డాన్స్ మూమెంట్ సింక్ అయ్యేందుకు ఒకే స్టెప్‌ను 17 సార్లు చేయించాడట రాజమౌళి. అన్ని సార్లు చెర్రీ, తారక్ ఇద్దరూ సేమ్ రిథమ్‌తో స్టెప్స్ వేస్తూనే ఉన్నారట. ఆ షూటింగ్ తరువాత చాలా రోజులు మోకాళ్ల నొప్పితో బాధ పడ్డాడట రామ్ చరణ్. కానీ రాజమౌళి చేసింది మొత్తం సినిమా కోసమే.. మా ఫ్యూచర్ కోసమే.. అందుకే ఆయన పెట్టే బ్యూటిపుల్ టార్చన్‌ను మేం ఎప్పుడూ ఆనందంగా భరిస్తామంటూ చెర్రీ చెప్పాడు. అటు ఇంట్లో తన భార్య కూడా ఇలాగే ప్రవర్తిస్తుంది ఉపాసనను ఫన్నీగా టీజ్ చేశాడు రామ్ చరణ్. కొన్ని విషయాలు తనకు కష్టంగా అనిపించినా ఆర్డర్ వేసింది భార్య కాబట్టి పాటించక తప్పదంటూ అందరినీ నవ్వించాడు. ఉపాసన చెప్పేది కూడా తన మంచి కోసం కాబట్టి ఆ బ్యూటిపుల్ టార్చర్‌ను కూడా తాను ఎంజాయ్ చేస్తానని భార్యపై ప్రేమ కురిపించాడు. తన విషయంలో రాజమౌళి, ఉపాసన ఇద్దరూ ఒకేలా బిహేవ్ చేస్తారంటూ ఇద్దరినీ కంపేర్ చేశాడు. రామ్‌చరణ్, ఉపాసన పెయిర్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షూటింగ్ అయినా ఈవెంట్ అయినా ఎప్పుడూ చరణ్ వెంటే ఉంటుంది ఉపాసన. తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌లో ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఇప్పుడు భార్య గురించి చెర్రీ చేసిన కామెంట్స్ వాళ్ల లవ్‌ను మరోసారి ప్రూవ్ చేశాయి.