RAM CHARAN: ఎన్టీఆర్.. నిజంగా రామ్ చరణ్‌కంటే వెనకబడిపోయాడా..?

అంబానీ వారసుడి పెళ్ళికి చరణ్ మాత్రమే వెల్లాడు కాబట్టి తననే స్టేజ్ మీదకు పిలిచాడు షారుఖ్ అంటున్నారు. అసలు స్టోరీ అదీ కాదు. బాలీవుడ్‌లో హిట్లున్నా, లేకున్నా పబ్లిక్ రిలేషన్ టీం అంటే పీఆర్ టీం బాగుంటేనే పేరు, ఆఫర్లొస్తాయంటారు.

  • Written By:
  • Publish Date - March 7, 2024 / 06:57 PM IST

RAM CHARAN: నాటు నాటు పాట వరల్డ్ వైడ్‌గా త్రిబుల్ ఆర్ సినిమాను పాపులర్ గామార్చింది. ఆస్కార్ వచ్చేలా చేసింది. అలాంటి పాట అంత ఫేమస్ అవటానికి కీరవాణి మ్యూజిక్, రాజమౌళి విజన్, కొరియోగ్రాఫర్ స్టెప్స్.. ఇక అదిరిపోయేలా స్టెప్స్ వేసిన చరణ్, ఎన్టీఆర్ పెర్పామెన్స్. ఇవన్నీ నాటునాటు పాటని తూటాలా దూసుకెళ్లేలా చేశాయి. అలాంటి పాటని ఈమధ్య అంబాని వారసుడు అనంత్ వెడ్డింగ్ రోజు ఖాన్ త్రయం వేసింది.

Telangana High Court: కోదండరాంకు షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఇప్పుడు రేవంత్ ఏం చేయబోతున్నారు.?

ఐతే ఆ టైంలో షారుఖ్ పూర్తిగా రామ్ చరణ్ ఎక్కడ అంటూ పిలిపించీ మరి తనతో కలిసి డాన్స్ వేశాడు. ఐతే ఇండ్లీ సాంబార్ తర్వాత చరణ్ అనటం కూడా విమర్శలకు కారణమైనా, అది తన మూవీలో డైలాగ్ అని తేలటంతో వివాదం సద్దుమణిగింది. ఇక్కడ టాపిక్ నాటు సాంగ్‌తో మొదలైన కాంట్రవర్సీ కాదు, అసలు ఆ పాటకి ఖాన్లు డాన్స్ చేస్తుందే చరణ్‌ని మాత్రమే పిలవటం ఏంటి? అది చరణ్, తారక్ ఇద్దరి వల్ల ఫేమస్ అయిన సాంగ్ కదా అన్నడౌట్లు పెరిగాయి. కాకపోతే అంబానీ వారసుడి పెళ్ళికి చరణ్ మాత్రమే వెల్లాడు కాబట్టి తననే స్టేజ్ మీదకు పిలిచాడు షారుఖ్ అంటున్నారు. అసలు స్టోరీ అదీ కాదు. బాలీవుడ్‌లో హిట్లున్నా, లేకున్నా పబ్లిక్ రిలేషన్ టీం అంటే పీఆర్ టీం బాగుంటేనే పేరు, ఆఫర్లొస్తాయంటారు. చరణ్‌కి త్రిబుల్ ఆర్‌తో ఎంత పేరొచ్చిందో, అంతే పేరు, క్రేజ్ తారక్‌కి వచ్చింది. కాని బాలీవుడ్‌లో మంచి పీఆర్ టీంతో చరణ్ తనని తాను అక్కడ బానే ప్రమోట్ చేసుకుంటున్నాడు.

కాని తారక్ ఈ విషయంలో వెనకబడ్డాడంటున్నారు. తను వార్ 2 మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నా కాని.. నార్త్ ఇండియాలో చరణ్ గురించి జరిగే చర్చలో సగం కూడా ఎన్టీఆర్ మీద జరగట్లేదు. ఇదంతా పీర్ టీం చలవే అంటున్నారు. చిరు వారసుడిగా చరణ్‌కి ఎంత క్రేజున్నా, నందమూరి వంశం నుంచి వచ్చిన తారక్‌కి కూడా సాలిడ్ బ్యాగ్రౌండే ఉంది. అయినా చెర్రికి దక్కిన ఫోకస్ పాపులారిటీ, నార్త్‌లో తారక్‌కి దక్కట్లేదు.