మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ఇప్పుడు దేవర రేంజ్ సునామీ క్రియేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే తన ఫ్రెండ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో త్రిబుల్ ఆర్ లో స్క్రీన్ షేర్ చేసుకున్న చరణ్, ఇప్పుడు హిస్టరీ కూడా షేర్ చేసుకోక తప్పదు. లేదంటే వెనకబడిపోతాడు. ఆచార్యాలో కేవలం గెస్ట్ రోల్ కాబట్టి నో ప్రాబ్లమ్ కాని, లేదంటే త్రిబుల్ ఆర్ తర్వాత ఫెల్యూర్ ఫేస్ చేసిన హీరోగా మచ్చ పడేది…ఏదేమైనా గేమ్ ఛేంజర్ తోనే తను కూడా పాన్ ఇండియా లెవల్లో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకు తను రాజమౌలి ఫార్ములానే వాడుతున్నాడు. మగధీరలో శతద్రువంశం యోధుడిగా కనిపించిన చరణ్, త్రిబుల్ ఆర్ లో లాఠీతో కొడితే కొట్టాలిరా వెయ్యి కొట్టాలి అని చెప్పి చూశాడు. చేసి చూపించాడు. ఇప్పుడు 2 వేల మందితో ఫైట్ ని గన్ తో కాదు, పెన్ తో చేశాడు… వందమందిని కొడితే వందకోట్లు… వెయ్యిమందిని ఉతికి ఆరేస్తే వెయ్యి కోట్లు.. మరి 2 వేల మందిని కొడితే 2 వేల కోట్లొస్తాయా..? ఇండస్ట్రీలో టాక్ తో ఏమని తేలింది?
శతద్రువంశ యోధుడిగా వచ్చి 100 మందిని ఏసేశాకే, చనిపోయే వారియర్ గా వందకోట్లు రాబట్టాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఆతర్వాత వెయ్యి మందికి పైనే ఫ్రీడమ్ ఫైటర్స్ గుంపుతో పోరాడి తే 1200 కోట్ల వసూళ్లొచ్చాయి. త్రిబుల్ ఆర్ తో ఆస్కార్ అవార్డు వరకు ప్రశంసలు దక్కాయి.ఇప్పుడు లెక్క పెరిగింది. 2 వేల మందితో ఓ ఐఏఎస్ ఆఫీసర్ గా గేమ్ ఛేంజర్ లో ఫైట్ చేశాడు చరణ్.
ఈ మూడు సినిమాల పోస్టర్ లు కలిపి వేసిన ఓ మీమ్ సోసల్ మీడియాలో వైరలైంది. ఈ సినిమా పాటలకంటే కూడా ఈ మీమే ఊహించని రీతిలో సెన్సేషన్ అవుతోంది. వందమందిని చంపి కాని చావని వారియర్ గా మగధీరలో ఫైట్ సీన్ ఫోటో, 1200లకి పైనే మందితో ఫైట్ చేసే పోలీస్ ఆఫీసర్ గా చరణ్ మరో ఫోటో, ఇక గేమ్ ఛేంజర్ లో వేల మంది తనమీదకు దాడికి వస్తుంటే కూడా జంకని, ఐఏఎస్ ఆఫీసర్ గా తన ఫోటో ఈ మూడింటిని కలిపి ఓ మీమ్ రెడీ చేశారు.
ఈ ఒక్క మీమే ఊహించనంత క్రేజ్ ని సోషల్ మీడియాలో, యూట్యూబ్ షాట్స్ లో భారీగా వైరలైంది. సంక్రాంతికి వచ్చే గేమ్ ఛేంజర్ కి ఇప్పటి నుంచే మెల్లిగా వైబ్రేషన్స్ మొదలౌతున్నాయి. లేటుగా తెరకెక్కిన మూవీగా, వాయిదాలు పడ్డ సినిమాగా… భారతీయుడు 2 డిజాస్టర్ ఫేస్ చేసిన శంకర్ డైరెక్షన్ లో వస్తున్న మరో సినిమాగా, గేమ్ ఛేంజర్ మీద చాలా వరకు జనాల్లో ఆసక్తి తగ్గింది.
అలాంటి టైంలో పాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఇప్పుడు మీమ్స్ కూడా గేమ్ ఛేంజర్ ని గేమ్ ని నిజంగా ఛేంజ్ చేస్తున్నాయి. చాలా వరకు చరణ్ యాంటీ ఫ్యాన్స్ అయితే ఇక గ్లోబల్ స్టార్ కి ఫ్లాప్ పడినట్టే అని పండగ చేసుకుంటున్నారనే కామెంట్స్ కూడా పెరిగాయి. కారణం భారతీయుడు 2 ఓరేంజ్ లోఫ్లాప్ అవటంతో, ఇక గేమ్ ఛేంజర్ కూడా కష్టమే అని అనుకుంటున్నారు. కాని ఇక్కడే సీన్ లో ట్విస్ట్ ఉంది
శంకర్ కి సాలిడ్ కథ దొరికితే, బాక్సాపీస్ తో ఆడుకుంటాడని జెంటిల్మన్ నుంచి రోబో వరకు ప్రూవ్ అయ్యింది. కేవలం కథా లోపాలే తన వరుస ఫ్లాపులకు కారణమౌతున్నాయి. అందుకే సాలిడ్ రైటర్ కమ్ డైరెక్టర్ గా పేరున్న కార్తిక్ సుబ్బరాజు, కథ అందించటం, ఫైనల్ అవుట్ పుట్ దిల్ రాజుకి తెగ నచ్చటంతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడాఫస్ట్ కాపీ చూసి ఫుల్ కుషీ అయ్యారట. సో గేమ్ ఛేంజర్ కథ పరంగా వంకపెట్టలేని సినిమా అని తెలుస్తోంది. అదే నిజమైతే, సోషల్ మీడియాలో వందకోట్ల మగధీర, 1000 కోట్లు దాటిన త్రిబుల్ ఆర్ తర్వాత, 2 వేల కోట్ల గేమ్ ఛేంజర్ అన్న మాట కొంతవరకు నిజమయ్యే ఛాన్సెసే ఎక్కువున్నాయి