Delhi: చరణ్‌ అమిత్‌ షా మీటింగ్‌లో చర్చించింది ఇదే !?

ఎట్టకేలకు ట్రిపులార్ టీం అనుకున్నది సాధించారు. అందని ద్రాక్షగా ఉన్న ఆస్కార్‌ అవార్డును ఇండియాకు రప్పించారు.

  • Written By:
  • Publish Date - March 19, 2023 / 02:00 PM IST

నాటు నాటు సాంగ్‌ ఆస్కార్‌కు నామినేట్‌ అయినప్పటినుంచీ డే అండ్‌ నైట్ ప్రమోషన్స్‌ నిర్వహించారు. ఫ్యామిలీస్‌తో సహా అమెరికాలో మకాం వేసి ఎట్టకేలకు ఆస్కార్‌ను ఇండియాకు పట్టుకొచ్చారు. ఇక ఇప్పుడు నేషనల్‌ అవార్డ్స్‌కు సమయం ఆసన్నమైంది. అయితే ఇద్దరు హీరోల్లో కేవలం ఒక్కరికి మాత్రమే నేషనల్‌ అవార్డ్‌ వస్తుంది. ఇక్కడే ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్‌ తీసుకుంది.

ఇండియాకు రాగానే చరణ్‌ ఢిల్లీలోనే ఆగిపోయాడు. చరణ్‌ను రిసీవ్‌ చేసుకునేందుకు మెగాస్టార్‌ నేరుగా ఢిల్లీ వెళ్లారు. చరణ్‌తో సహా వెళ్లి అమిత్‌ షాను కలిశారు. త్వరలో అనౌన్స్ చేయనున్న నేషనల్‌ అవార్డ్‌ ఫంక్షన్‌ గురించి మట్లాడేందుకే చిరంజీవి, చరణ్‌ అమిత్‌ షా దగ్గరికి వెళ్లారని సినీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. బీజేపీలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి రామ్‌ చరణ్‌కు బెస్ట్‌ యాక్టర్‌ కేటగిరీలో నేషనల్‌ అవార్డ్‌ ఇప్పించేందుకు చిరంజీవి ప్రయత్నిస్తున్నారట.

రీసెంట్‌గా ఇండియా ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ మినిస్టర్‌ అనురాగ్‌ తాకూర్‌ హైదరాబాద్‌ వచ్చినప్పుడు మెగాస్టార్‌ను కలిశారు. అప్పుడు కూడా ఇదే విషయం గురించి చర్చింనట్టు సమాచారం. అయితే ఇటు రాజమౌళి నేషనల్‌ అవార్డ్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ రాజ్యసభ సభ్యడు, ప్రధానితో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి. దీంతో మినిస్టర్స్‌తో మాట్లాడి అవార్డ్‌ ఎన్టీఆర్‌కు వచ్చేలా జక్కన్న ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

అయితే ఈ ఇద్దరిలో ఎవరికి అవార్డ్‌ వచ్చినా అది ట్రిపులార్‌ సినిమాకు గర్వకారణమే. కేవలం బెస్ట్‌ యాక్టర్‌ కేటగిరీలోనే కాకుండా విజువల్‌ఎఫెక్ట్స్‌, బెస్ట్‌ మ్యూసిక్‌, బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌, బెస్ట్‌ కొరియోగ్రఫీ కేటరిరీల్లో కూడా నేషనల్‌ అవార్డ్‌కు ట్రిపులార్‌ను నామినేట్‌ అయ్యే అవకాశం ఉందని టాక్‌.