Ram Charan: రామ్ చరణ్ ‘మెగా’ రివేంజ్.. తగ్గేదే లే!

అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటనా లేకపోయినా.. సినిమా చుట్టూ చాలా విషయాలే చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ రిలీజైంది. ఓ ఫ్యాన్ క్రియేట్ చేసిన ఈ పోస్టర్ వల్ల రామ్ చరణ్‌తో బుచ్చిబాబు తీయబోయే సినిమా కథ లీకైందనే ప్రచారం మొదలైంది.

  • Written By:
  • Publish Date - May 6, 2023 / 06:00 PM IST

Ram Charan: ‘మెగాపవర్ స్టార్’ రామ్ చరణ్ రివేంజ్ తీసుకునే పనిలో బిజీ అవ్వబోతున్నాడు. త్వరలో రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అనేక అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటనా లేకపోయినా.. సినిమా చుట్టూ చాలా విషయాలే చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ రిలీజైంది. ఓ ఫ్యాన్ క్రియేట్ చేసిన ఈ పోస్టర్ వల్ల రామ్ చరణ్‌తో బుచ్చిబాబు తీయబోయే సినిమా కథ లీకైందనే ప్రచారం మొదలైంది. విచిత్రం ఏంటంటే బుచ్చిబాబుతో చెర్రీ చేయబోయే సినిమా తాలూకు పోస్టర్ ఫ్యాన్ మేడే అయినా, లీకైన స్టోరీ లైన్ మాత్రం నిజమైందే అని తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో ప్లాన్ చేసిన స్పోర్ట్స్ డ్రామాని రామ్ చరణ్‌తో తీయబోతున్నాడు బుచ్చి బాబు. ఈ ప్రాజెక్ట్‌ని సెప్టెంబర్‌లో సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. అంతా బానే ఉంది కానీ.. ఇది స్పోర్ట్స్ బేస్డ్‌గా తెరకెక్కే రివేంజ్ డ్రామా అని కొత్తగా లీకులు అందుతున్నాయి.

ఓ క్రికెటర్ కెరీర్‌తో ఆడుకునే పోలిటీషియన్స్ మీద రివేంజ్ తీసుకునే హీరో కథే బుచ్చి బాబు మూవీ అంటున్నారు. ఇంకో అడుగు ముందుకేసి.. ఇండియన్ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు జీవితంలోని సంఘటనల్ని ప్రేరణగా తీసుకుని బుచ్చి బాబు ఈ కథ సిద్దం చేసుకున్నాడట. సో.. ఫ్యాన్ మేడ్ పోస్టర్‌లో కొన్ని సార్లు రివేంజ్ తీసుకోక తప్పదనే మీనింగ్ వచ్చే సబ్ టైటిల్ ఉంది. అది అచ్చంగా సినిమా కథ తెలిసిన వాళ్లే డిజైన్ చేసిన పోస్టర్ అనే చర్చ జరుగుతోంది.