RRR: ఆర్ఆర్ఆర్ వల్ల చెర్రీ, జూనియర్‌లలో ఎవరికి ఎక్కువ పేరొచ్చింది?

ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ గెలుచుకున్న తర్వాత ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. హాలీవుడ్‌ సెలబ్రిటీస్‌ను సైతం ఇంప్రెస్‌ చేసి ప్రశంసలు అందుకున్నారు ఇద్దరూ. ఆస్కార్‌ సెలబ్రేషన్స్‌కు రామ్‌చరణ్‌ 10 రోజుల ముందుగానే వెళ్లి టాక్‌షోలో పాల్గొన్నాడు.

  • Written By:
  • Publish Date - April 28, 2023 / 05:45 PM IST

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ ఎవరికి ఎక్కువ పేరు తీసుకొచ్చింది? ఎన్టీఆర్‌కు ప్లస్‌ అయిందా? రామ్‌చరణ్‌ స్టార్‌డమ్‌ పెంచిందా? రాజమౌళితోపాటు.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ గ్లోబల్‌వైడ్‌ ఫేమస్‌ అయ్యారు. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ గెలుచుకున్న తర్వాత ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. హాలీవుడ్‌ సెలబ్రిటీస్‌ను సైతం ఇంప్రెస్‌ చేసి ప్రశంసలు అందుకున్నారు ఇద్దరూ.

ఆస్కార్‌ సెలబ్రేషన్స్‌కు రామ్‌చరణ్‌ 10 రోజుల ముందుగానే వెళ్లి టాక్‌షోలో పాల్గొన్నాడు. అలాగే.. ఓ అవార్డు ఫంక్షన్‌లో సందడి చేయడంతో హాలీవుడ్‌ ఫోకస్‌ చెర్రీపై పడింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హాలీవుడ్ మూవీ చేస్తున్నట్టు కూడా చెప్పాడు. ఆస్కార్‌ టైంలో రామ్‌చరణ్‌.. ఎన్టీఆర్‌ను డామినేట్‌ చేసినట్టు కనిపించాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఎన్టీఆర్‌ కంటే రామ్‌చరణ్‌కే ప్లస్‌ అయిందంటూ కథనాలు వచ్చాయి. అయితే ప్రాక్టికల్‌గా చూస్తే ఛాన్సులు అందుకోవడంలో ఎన్టీఆరే ముందంజలో వున్నాడు. ‘గార్డియన్స్‌ ఆఫ్‌ గెలాక్సీ’ సిరీస్‌ దర్శకుడు జేమ్స్‌ గన్‌ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుందన్నాడు. గార్డియన్స్‌ ఆఫ్‌ గెలాక్సీ మూడో భాగం ప్రమోషన్‌లో ‘గెలాక్సీ ప్రపంచంలోకి ఎవరైనా ఇండియన్‌ యాక్టర్‌ను తీసుకోవాలనుకుంటే.. ఎవరిని ఎంచుకుంటారని అడిగితే.. ఎన్టీఆర్‌ పేరు చెప్పకుండానే… తెలివిగా సమాధానం చెప్పాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌లో అడవి మృగాలతో జంప్‌ చేసిన హీరోను తీసుకుంటానన్నాడు. జేమ్స్‌ గన్‌ సమాధానంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అయిపోయారు. తమ హీరో హాలీవుడ్‌ ఎంట్రీ త్వరలోనే వుందంటున్నారు. ఎన్టీఆర్‌ క్రేజ్‌ హాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ అండర్‌ కరెంట్‌గా సాగుతోంది. వార్‌-2లో హృతిక్‌తో కలిసి నటించే ఛాన్స్‌ అందుకున్నాడు. బ్రహ్మాస్త్ర ఫేం అయాన్‌ ముఖర్జీ డైరెక్ట్‌ చేసే ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి రానుంది. రామ్‌చరణ్‌ శంకర్‌ సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో పాన్‌ ఇండియా మూవీ చేస్తున్నా.. బాలీవుడ్ ఆఫర్‌ దక్కలేదు. ‘గార్డియన్స్‌ ఆఫ్‌ గెలాక్సీ’ని ఇండియన్‌ యాక్టర్‌తో తీయాలనుకుంటే.. ఏ హీరోను తీసుకుంటారని యాంకర్‌ అడిగితే.. హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ గన్‌ ఎన్టీఆర్‌ పేరు చెప్పాడు. అలాగని ఎన్టీఆర్‌ను డైరెక్ట్‌ చేస్తాడని కాదు. తెలుగు హీరో ఆర్‌ఆర్‌ఆర్‌తో హాలీవుడ్‌ డైరెక్టర్స్‌ను ఇంప్రెస్‌ చేశాడంటే.. ఏదో ఒకసారి ఆ ఛాన్స్‌ అందుకుంటాడేమో చూడాలి. ఎన్టీఆర్‌, చరణ్‌.. ఇద్దరిలో హాలీవుడ్‌ క్లాప్‌ బోర్డ్‌ ఎవరిపై ముందుగా పడుతుందో మరి.