రామ్ చరణ్-ప్రశాంత్ నీల్ కాంబో ఫైనల్, ఈ ట్విస్ట్ ఏంట్రా బాబూ…?

ఏ ముహూర్తాన కేజిఎఫ్ సినిమా చేసాడో ప్రశాంత్ నీల్... అక్కడి నుంచి ఈ స్టార్ డైరెక్టర్ కు దెబ్బకు హీరో ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు మన తెలుగు హీరోలతో పాటు బాలీవుడ్ హీరోలు కూడా ప్రశాంత్ నీల్ కోసం ఎదురు చూస్తున్నారు.

  • Written By:
  • Publish Date - October 8, 2024 / 06:15 PM IST

ఏ ముహూర్తాన కేజిఎఫ్ సినిమా చేసాడో ప్రశాంత్ నీల్… అక్కడి నుంచి ఈ స్టార్ డైరెక్టర్ కు దెబ్బకు హీరో ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు మన తెలుగు హీరోలతో పాటు బాలీవుడ్ హీరోలు కూడా ప్రశాంత్ నీల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఓ హీరోకి యాక్షన్ సీన్స్ ఎలా పడాలి, వాటికి ఎలివేషన్ ఏ రేంజ్ లో ఉండాలి, ఇక సినిమా మధ్యలో హీరో రేంజ్ పెంచడానికి ఏ సీన్స్ పడితే ఈ తరం వాళ్లకు నచ్చుతాయి అనేది పక్కాగా డిజైన్ చేసుకుని చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. తాను ఒక కాన్సెప్ట్ అనుకుంటే దానిపై ఎవడు ఎన్ని విమర్శలు చేసినా ముందుకు వెళ్తున్నాడు.

ఇప్పుడు ప్రశాంత్ నీల్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండగా రాబోయే ఆరేళ్ళకు సరిపడా సినిమాలను లైన్ లో పెట్టేసాడు. ఎన్టీఆర్ తో సినిమా తర్వాత సలార్ 2 చేయనున్నాడు. దీనికి ఇప్పటికే కథ కూడా సిద్దమైంది. దాని తర్వాత కేజిఎఫ్ 2 సినిమా ఉంటుంది. దాని తర్వాత అల్లు అర్జున్ తో సినిమా అనే టాక్ వచ్చింది. కాని… అల్లు అర్జున్ కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అనే క్లారిటీ వచ్చేసింది. ఎస్ ఇప్పుడు ఈ సినిమా దాదాపుగా ఫైనల్ అయిపొయింది.

స్టోరీ లైన్ కూడా రెడీ చేసుకున్నాడట ఈ కన్నడ డైరెక్టర్. రామ్ చరణ్ ఎప్పటి నుంచో ప్రశాంత్ తో ఓ సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాడు. అయితే అది వరుస ప్రాజెక్ట్ ల కారణంగా వాయిదా పడుతోంది. కాని ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే డీవీవీ దానయ్య… ప్రశాంత్ నీల్ కు అడ్వాన్స్ కూడా ఇవ్వడం షాకింగ్ విషయం. దీనిపై గత నెల రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయట. ఎప్పటి నుంచో దానయ్య… ప్రశాంత్ నీల్ సినిమాను నిర్మించాలని చూస్తున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు ఫైనల్ అయిందని సమాచారం.

సినిమా విడుదల కచ్చితంగా 2029 లేదా 2030లో ఉండవచ్చని టాక్. ఇది పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ మూవీ అని టాక్. ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాపై వర్క్ మొదలుపెట్టాడు. షూటింగ్ కూడా ఇతర నటులతో పూర్తి చేసేస్తున్నాడు. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ షూట్ కి వచ్చే అవకాశం ఉంది. ఈ లోపు కీలక సన్నివేశాలను ఇతర నటులతో పూర్తి చేసేయాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉండే అవకాశం కనపడుతోంది. రెండేళ్ళ తర్వాతనే ఈ సినిమా విడుదల ఉంటుందని టాక్. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందని సమాచారం.