సినిమాల్లో రంగు రంగుల బట్టలే కాదు. ఆఫ్‌లైన్ కూడా ఇప్పటి హీరోస్ మంచి అవుట్‌ఫిట్ మెయిన్‌టేన్ చేస్తున్నారు. చూసేందుకు సింపుల్‌గానే కనిపించినా.. వాళ్లు వేసుకునే ఒక్కో టీ షర్ట్ వేలల్లో ఉంటుంది. ఇప్పుడున్న హీరోల్లో ఆఫ్‌లైన్ స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్ లీడ్‌లో ఉంటాడు. దీని గురించి చెర్రీ ఫ్యాన్స్ చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఆఫ్‌లైన్ లుక్‌లో చెర్రీని కొట్టేవాడు లేడంటూ కాలర్ ఎగరేస్తారు. నిజానికి చెర్రీ వాడే కాస్టూమ్ కూడా అలాగే ఉంటుంది. ప్రతీ ఈవెంట్‌లో డిఫరెంట్ డిఫరెంట్ అవుట్‌ఫిట్‌తో అదరగొడతాడు. కెరియర్ స్టార్టింగ్‌లో కాస్త సింపుల్‌గానే ఉన్నా.. ఆరెంజ్ సినిమా నుంచి తన లుక్స్‌తో కేక పుట్టిస్తున్నాడు చెర్రీ. రీసెంట్‌గా జరిగిన ఆస్కార్ వేడుకలో చెర్రీ వేసుకున్న సూట్ కాస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇండియా వైడ్‌గా మంచి పేరున్న ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ నిఖితా సింఘానియా ఈ సూట్ డిజైన్ చేశారు. ఈ సూట్ కాస్ట్ దాదాపు లక్ష డాలర్లు ఉంటుందని టాక్. అంటే ఇండియన్ రూపీ ప్రకారం 80 లక్షల పైమాటే. ఓ స్పెషల్ హ్యాండ్‌మేడ్ క్లాత్‌తో ఈ సూట్‌ను తయారు చేశారట. అందుకే ఈ సూట్‌కు ఇంత కాస్ట్ ఉందని ఇంటర్నెట్‌లో టాక్ నడుస్తుంది. ఈ విషయం తెలిసినివాళ్లు ఒక్క సూట్‌కు 80 లక్షలా అంటూ షాకవుతున్నారు. ఒక్క ఈవెంట్‌లో వేసుకుని పక్కన పడేసే సూట్ కోసం ఇన్ని లక్షలా అంటూ అవాక్కవుతున్నారు.