Ram Charan: ఉపాసన కోసం చరణ్‌ కీలక నిర్ణయం

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ త్వరలో తండ్రి కాబోతున్నాడనే విషయం కొణిదెల కుటుంబంలోనే కాకుండా మెగా ఫ్యాన్స్‌ను కూడా ఖషీ చేసింది. కొన్ని రోజుల క్రితం దుబాయ్‌లో, రీసెంట్‌గా చిరంజీవి ఇంట్లో ఉపాసనకు సీమంతం కూడా జరిగింది. కొన్ని నెలల్లోనే ఉపాసనకు డెలివరీ కాబోతోంది. బుల్లి గ్లోబల్‌స్టార్‌ కోసం మెగా ఫ్యాన్స్‌ అంతా వెయిట్‌ చేస్తున్నారు. అయితే ఇలాంటి టైంలో ఉసాసన కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట రామ్‌ చరణ్‌.

  • Written By:
  • Publish Date - April 22, 2023 / 02:45 PM IST

ఉపాసన డెలివెరీ అయ్యాక 3 నెలల పాటు భార్యతోనే ఉండాలని నిర్ణయించున్నాడట. దీనికోసం ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్‌లకు బ్రేక్‌ ఇవ్వాలని డిసైడ్‌ అయినట్టు సమాచారం. తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చి.. ఉపాసన కాస్త రికవర్‌ అయ్యేవరకూ తనతోనే ఉండాలనుకుంటున్నాడట రామ్‌ చరణ్‌. దీనికి తగ్గట్టుగా తన షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసుకుంటున్నాడట. మొదటి నుంచి ఉపాసన అంటే రామ్‌ చరణ్‌కు చాలా ఇష్టం. ఉపాసనకు కూడా చరణ్ అంటే ప్రాణం. ప్రతీ షూటింగ్‌లో చరణ్‌ వెంటే వెళ్తుంది. ఓ మేనేజర్‌లా ఎప్పుడు చూసినా చరణ్‌కు సపోర్ట్‌గా ఉంటుంది.

పదేళ్ల క్రితం వీళ్లద్దరు లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా వీళ్లకు పిల్లలు లేకపోవడంతో చాలా రూమర్స్‌ వచ్చాయి. కానీ ఎప్పుడూ ఎక్కడా వాళ్లిద్దరూ డల్‌ అవ్వలేదు, హోప్‌ కోల్పోలేదు. ప్రతీ విమర్శను ఆశీర్వాదంగా తీసుకున్నారు. రీసెంట్‌గా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఉపాసన. సొసైటీ కోరుకున్నప్పుడు కాదు.. తాను చరణ్‌ కోరుకున్నప్పుడే పేరెంట్స్‌ అవ్వాలని ముందే డిసైడ్‌ అయ్యామని చెప్పింది.

ఆమె అన్నట్టుగానే ఇంకొన్ని రోజుల్లో వాళ్లిద్దరూ పేరెంట్స్‌ కాబోతున్నారు. ఉపాసన కోసం చరణ్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెగా ఫ్యాన్స్‌ అంతా సపోర్ట్‌ చేస్తున్నారు. ఈ నిర్ణయంతో చరణ్‌ బెస్ట్‌ హస్బెండ్‌ అనిపించుకున్నాడంటున్నారు. యాక్టింగ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లో కూడా రామ్‌ చరణ్‌ హీరో అంటూ తమ అభిమాన తారను ఆకాశానికెత్తేస్తున్నారు.