Ram Charan: గ్లోబల్‌స్టార్ రాంచరణ్.. గేమ్‌ఛేందర్ మూవీతో చాలా బిజీగా ఉన్నాడు. జరగండి అంటూ చెర్రీ బర్త్‌డే రోజు రిలీజ్ అయిన లిరికల్ సాంగ్‌కు మిక్స్‌డ్ రియాక్షన్ కనిపిస్తోంది. శంకర్‌తో గేమ్ ఛేంజర్ తర్వాత.. బుచ్చిబాబు డైరెక్షన్‌లో మూవీ కమిట్ అయ్యాడు రాంచరణ్. ఐతే ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో చిన్న ట్రిప్ వేశాడు. ఉపాసన, కూతురు క్లీంకారా కలిసి థాయ్‌లాండ్ ట్రిప్ వెళ్లాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉపాసన.. ఆ ట్రిప్ విశేషాలను అభిమానులతో పంచుకుంటోంది.
Kalki 2898 AD: అస్సలు ఊహించలేదుగా.. ఓటిటిలోకి కల్కి
ఇలా ఉపాసన ఆసక్తికర పోస్ట్ చేశారు. అందులో ఎండవేడిమిని తట్టుకోలేని ఓ పిల్ల ఏనుగుకు.. రామ్ చరణ్ పైపుతో నీళ్లు పడుతూ వేసవి తాపం తీర్చుతున్నాడు. కుటుంబ సమేతంగా తాము ఓ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించామని ఉపాసన రాసుకొచ్చారు. థాంక్యూ మిస్టర్ సి.. అద్భుతమైన అనుభవాన్ని అందించారు. ఈ ఏనుగుల రెస్క్యూ క్యాంప్‌లో ఎంతో నేర్చుకున్నాం అంటూ రాసుకొచ్చింది ఉపాసన. ఐతే ఈ ఈ ఫొటోలో క్లీంకార గుండుతో కనిపిస్తోంది. అమ్మ ఉపాసన చంకనెక్కిన క్లీంకార.. నాన్న రామ్ చరణ్ చేస్తున్న పనిని ఆసక్తిగా గమనిస్తూ ఉంది. ఫేస్ పూర్తిగా కనిపించలేదు కానీ.. ఆ గుండు లుక్‌లో చాలా క్యూట్‌గా కనిపించింది క్లీంకారా. ఈ మెగాప్రిన్సెస్‌ను.. రాంచరణ్ దంపతులు ఇప్పటివరకు ఫ్యాన్స్‌కు చూపించలేదు.
ఈ మధ్య తిరుపతికి వెళ్లినప్పుడు.. ఓ ఫొటో లీక్ అయింది అంతే. ఐతే తిరుపతిలోనే స్వామివారికి.. క్లీంకారా తలనీలాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే ఫ్యామిలీతో కలిసి రాంచరణ్.. థాయ్‌లాండ్ ట్రిప్‌కు వెళ్లాడు. క్లీంకారా గుండు లుక్‌లో ఉన్న ఈ ఫొటో.. ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. క్యూట్ అని కొందరు.. ప్రిన్సెస్‌ను ఇంకెప్పుడు చూపిస్తావ్ చెర్రీ అని ఇంకొందరు.. ఇలా రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.