ram charan: ప్రేమకు ప్రేమతో.. ఉపాసన వాలెంటైన్స్ డే పోస్ట్..

తాజాగా ఉపాసన షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. వాలెంటైన్స్ డే సందర్భంగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

  • Written By:
  • Updated On - February 14, 2024 / 09:34 PM IST

ram charan: ఉపాసన గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. రామ్ చరణ్ సతీమణీగానే కాకుండా.. వివిధ సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నారు. ఇక అది అలా ఉంటే ఉపాసన తాజాగా కొన్ని ఫోటోలు పంచుకున్నారు.

Jr NTR: రిస్క్ చేస్తున్నాడా.. బాలీవుడ్ స్టార్స్ పాలిట విలన్‌గా ఎన్టీఆర్

తాజాగా ఉపాసన షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. వాలెంటైన్స్ డే సందర్భంగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పదకొండేళ్ల ప్రేమకు ప్రతిరూపం అంటూ రామ్ చరణ్, కూతురు క్లీంకార చేతిలో చేయి వేసిన ఓ ఫోటోను పంచుకున్నారు. మెగా అభిమానుల కోసం ఈ ఫొటోను షేర్ చేసుకున్నారు. పేరెంట్స్ చేతుల్లో మెగాప్రిన్సెస్ చిట్టి చేతిని చూసి అభిమానులు సంతోషం వ్యక్త పరుస్తున్నారు. బెస్ట్ కపూల్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. లక్కీ డాటర్ అంటూ మరికొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అపోలో హాస్పిటల్ కో ఫౌండర్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన, మెగా హీరో రామ్ చరణ్ స్నేహితులు.

ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఉపాసన మాత్రం ఇండస్ట్రీలో కాకుండా వైద్యరంగంలో, సామాజిక సేవారంగంలో ఉన్నతిని సాధిస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మెగా ఫ్యామిలీ అభిమానులతో టచ్ లో ఉంటారు. వాలెంటైన్స్‌డే సందర్భంగా ఉపాసన అరుదైన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. రామ్‌చరణ్‌ కెరీర్ విషయానికి వస్తే… శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌, బలమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ ఫేం బుచ్చి బాబు సాన దర్శత్వంలో చరణ్‌ ఓ సినిమా చేయబోతున్నారు.