RAM CHARAN: రంగస్థలంలో మళ్లీ అడుగు పెట్టనున్న రామ్ చరణ్

మార్చ్ సెకండ్ వీక్ నుంచి బుచ్చిబాబు సినిమా షూటింగ్ మొదలౌతుంది. హీరోయిన్ ఇంకా కన్ఫామ్ కాలేదు కాని, ప్రీ ప్రొడక్షన్ పనులు, సెట్స్ తాలూకు డిజైన్లు రెడీ అవుతున్నాయి. రంగస్థలం మూవీ కోసం ఎక్కడైతే ఊరి సెట్ వేశారో, ఇప్పుడు అక్కడే కొత్త సినిమా కోసం 12 ఎకరాల్లో రూ.20 కోట్ల విలువైన సెట్లు వేస్తున్నారట.

  • Written By:
  • Publish Date - January 25, 2024 / 05:51 PM IST

RAM CHARAN: రామ్ చరణ్‌తో దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ చేసిన మూవీ మార్చ్ 14కి పట్టాలెక్కబోతోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. గేమ్ ఛేంజర్ ప్యాచ్ వర్క్‌ని ఫిబ్రవరిలో పూర్తిచేయబోతున్నాడు శంకర్. తర్వాత మార్చ్ సెకండ్ వీక్ నుంచి బుచ్చిబాబు సినిమా షూటింగ్ మొదలౌతుంది. హీరోయిన్ ఇంకా కన్ఫామ్ కాలేదు కాని, ప్రీ ప్రొడక్షన్ పనులు, సెట్స్ తాలూకు డిజైన్లు రెడీ అవుతున్నాయి.

YS SHARMILA: వైఎస్ కుటుంబం చీలడానికి జగనే కారణం.. జగన్ ఒక నియంత: వైఎస్ షర్మిల

రంగస్థలం మూవీ కోసం ఎక్కడైతే ఊరి సెట్ వేశారో, ఇప్పుడు అక్కడే కొత్త సినిమా కోసం 12 ఎకరాల్లో రూ.20 కోట్ల విలువైన సెట్లు వేస్తున్నారట. కంప్లీట్ ప్రి ఇండిపెండెన్స్ పీరియడ్ లుక్ కోసం ఆ కాలాన్ని ప్రతిబింబించే సెట్లు, రోడ్లు, భవనాలు రెడీ చేస్తున్నారట. స్వాతంత్రానికి ముందు జరిగే ఓ స్పోర్ట్స్ డ్రామా ఇదని, దేశభక్తి అంశం కూడా ఇందులో ఉంటుందని తెలుస్తోంది. ఇందులో కూడా చెర్రీ డ్యూయెల్ రోల్ వేయబోతున్నాడు. ఏదేమైనా రంగస్థలంలో రామ్ చరణ్ వేసిన చిట్టబాబు పాత్రలాంటి పాత్రనే పోలిన రోల్‌లో చెర్రీ కనిపిస్తాడట.

అదే జరిగితే మెగా ఫ్యాన్స్‌కి పండగే అనుకోవాలి. అంతగా అచ్చొచ్చిన పాత్రకి, త్రిబుల్ ఆర్ ఫ్లేవర్ యాడ్ చేసే పనిలో ఉన్నాడు బుచ్చిబాబు. ఈ విషయంలో తన గురువు సుకుమార్ సాయం తీసుకుంటున్నాడట బుచ్చిబాబు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలవుతుంది.