రామ్ చరణ్ కి దేవర ఛాలెంజ్… 15 కోట్లతో ఛాలెంజ్ కి కౌంటర్…

మెగా పవర్ స్టార్ రామ్ చరన్ గ్లోబల్ స్టార్ గా మారాక, ఆచార్యతో నిరాశే ఎదురైనా, గేమ్ ఛేంజరే తన అసలైన పరీక్ష కింద కన్సిడర్ చేస్తున్నారు. ఆచార్య చిరుమూవీగానే చూస్తున్నారు కాబట్టి, త్రిబుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా లెవల్లో చరణ్ దుమ్ముదులుపుతాడా లేదా అన్న పరీక్ష, సోలోగా చేసిన గేమ్ ఛేంజర్ తోనే తేలబోతోంది.

  • Written By:
  • Publish Date - September 10, 2024 / 09:30 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరన్ గ్లోబల్ స్టార్ గా మారాక, ఆచార్యతో నిరాశే ఎదురైనా, గేమ్ ఛేంజరే తన అసలైన పరీక్ష కింద కన్సిడర్ చేస్తున్నారు. ఆచార్య చిరుమూవీగానే చూస్తున్నారు కాబట్టి, త్రిబుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా లెవల్లో చరణ్ దుమ్ముదులుపుతాడా లేదా అన్న పరీక్ష, సోలోగా చేసిన గేమ్ ఛేంజర్ తోనే తేలబోతోంది. అయితే ఈ పరీక్షను మించిన అగ్ని పరీక్ష లాంటి సవాల్ విసిరాడు ఎన్టీఆర్.

బేసిగ్గా చరణ్, ఎన్టీఆర్ రియల్ లైఫ్ లోకూడా క్లోజ్ ఫ్రెండ్స్. అలానే త్రిబుల్ ఆర్ కలిసి చేయటం తో వీళ్ల మధ్య స్నేహం మరింత పెరిగింది. కట్ చేస్తే ఒక విషయంలో ఒకరికి మరోకరు ఛాలెంజ్ లు విసురుకునే పరిస్థితి వచ్చింది. దేవరే ఇప్పుడు రామ్ చరణ్ కి అసలైన ఛాలెంజ్ గా మారింది

ఎందుకంటే దేవర మూవీ కంటే ముందే గేమ్ ఛేంజర్ సినిమా మొదలైంది. ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన దేవర చాలా లేటుగా పట్టాలెక్కింది. ఆలోపే శంకర్ తో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మొదలైంది. కట్ చేస్తే దేవరే ఈనెల 27 వస్తోంది. గేమ్ ఛేంజర్ డిసెంబర్ లో వస్తుందని దిల్ రాజు అన్నాడు. డిసెంబర్ 20 వస్తుందనే ప్రచారాలు తప్ప పూర్తి స్థాయి కాన్ఫిడెంట్ గా దిల్ రాజు టీం కూడా తేల్చలేకపోతోంది

అయితే దేవరగా ఎన్టీఆర్ దుమ్ముదులిపే ఛాన్స్ ఉన్నా, తనకంటే ముందే చరణ్ గేమ్ ఛేంజర్ మొదలైనా, దేవరే ముందుగా వస్తోంది కాబట్టి, ఇదో బిగ్ ఛాలెంజ్ అంటున్నారు. ఆ ఛాలెంజ్ ని చరణ్ 15 కోట్ల రిస్క్ తో ఫేస్ చేస్తున్నాడు. అదే త్రిబుల్ ఆర్ లో 2 వేల మంది తో ప్లాన్ చేసిన ఫైట్ లాంటిదే, గేమ్ ఛేంజర్ లో 1500 మందితో తెరకెక్కించాడు శంకర్. ఆ 15 నిమిషాల ఫైట్ సీన్ కోసం 15 కోట్లు ఖర్చు పెట్టారట. అది ప్రిక్లైమాక్స్ ఫైట్ అని, దాని మీదే శంకర్ భారీ అంచానాలు పెట్టుకున్నాడనే చర్చ జరుగుతోంది. సో లేటుగా వచ్చినా లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్ గేమ్ ఛేంజ్ చేస్తే పర్లేదు.. లేదంటే దేరవ రూపంలో ప్రాజెక్టుని లేటుగా మొదలు పెట్టి వేగందా, విడుదల చేస్తున్న ఎన్టీఆర్ ఛాలెంజ్ చరణ్ కి మోయలేని భారంగా మారుతుంది.