RAM CHARAN: మెగా పవర్ స్టార్ బర్త్ డేకి.. సెగ రేగాల్సిందేనా..?

రెండేళ్లనుంచి టైటిల్ గ్లింప్స్ తప్ప మరే వీడియోతో కూడా ఫ్యాన్స్‌కి అప్‌డేట్ ఇవ్వలేదు ఫిల్మ్ టీం. కాని చరణ్ బర్త్ డేకి మాత్రం పక్కా అప్‌డేట్ ఉంటుందన్నాడు. అదే గ్లింప్స్ అని తేలింది. 80 సెకన్ల నిడివితో ఆ ప్రోమో రాబోతోంది.

  • Written By:
  • Updated On - March 9, 2024 / 04:03 PM IST

RAM CHARAN: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో శంకర్ తీసిన గేమ్ ఛేంజర్ మూవీ గ్లింప్స్ రాబోతోంది. ఇది ఆల్రెడీ ఎప్పుడో ఎడిట్ చేసి, డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. ఆర్ ఆర్ మాత్రమే బ్యాలెన్స్ అని తెలుస్తోంది. నిమిషం మీద 20 సెకన్ల నిడివితో గేమ్ ఛేంజర్ గ్లింప్స్ రాబోతోందట. రెండేళ్లనుంచి టైటిల్ గ్లింప్స్ తప్ప మరే వీడియోతో కూడా ఫ్యాన్స్‌కి అప్‌డేట్ ఇవ్వలేదు ఫిల్మ్ టీం. కాని చరణ్ బర్త్ డేకి మాత్రం పక్కా అప్‌డేట్ ఉంటుందన్నాడు.

Pushpa2: పుష్ప‌-2లో మ‌రో స్టార్.. సుకుమార్ ఏం ప్లానింగ‌య్యా సామీ..!

అదే గ్లింప్స్ అని తేలింది. 80 సెకన్ల నిడివితో ఆ ప్రోమో రాబోతోంది. ఇదే కాదు.. బుచ్చిబాబు సనా మేకింగ్‌లో చరణ్, జాన్వీ కపూర్ చేసే సినిమా తాలూకు అప్‌డేట్ కూడా రాబోతోంది. రీసెంట్‌గా ఈ ఇద్దరితో చేసిన ఫోటో షూట్ వీడియోని, అలానే ప్రీ ప్రొడక్షన్ మేకింగ్ వీడియోని టైటిల్‌తో సహా ఎనౌన్స్ చేయబోతోంది సినిమాటీం. ఇది కూడా చరణ్ బర్త్ డే రోజున వీడియో రూపంలో రాబోతోంది. ఇక మెగా ఫ్యాన్స్‌కి మూడో సర్‌ప్రైజ్ ఏంటంటే, బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి మేకింగ్‌లో చరణ్ చేసే సినిమా అప్‌డేట్ కూడా మార్చ్ 27నే రాబోతోంది. ఇన్ని రోజులు మెగా అప్‌డేట్స్ లేక డీలా పడ్డ ఫ్యాన్స్ ఆకలి తీర్చేందుకు ఫుల్ మీల్స్ ప్లాన్ చేస్తున్నాడు చరణ్.