Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌పై క్లారిటీ..

దర్శకుడు శంకర్ 'ఇండియన్-2'తో బిజీ కావడంతో 'గేమ్ ఛేంజర్' ఆలస్యమవుతూ వస్తోంది. అయినప్పటికీ ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని చరణ్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 20, 2024 / 01:30 PM IST

Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే దర్శకుడు శంకర్ ‘ఇండియన్-2’తో బిజీ కావడంతో ‘గేమ్ ఛేంజర్’ ఆలస్యమవుతూ వస్తోంది. అయినప్పటికీ ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని చరణ్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

TSRTC: టీఎస్‌ఆర్టీసీ సరికొత్త ప్లాన్‌.. ఇక అందరికీ సీట్లు..

త్వరలోనే వారి ఎదురుచూపులు ఫలించే అవకాశముంది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశముందని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘ఇండియన్-2’ ఇంకా పూర్తి కాకపోవడం, చాలా రోజులుగా ‘గేమ్ ఛేంజర్’కి సంబంధించిన అప్డేట్స్ లేకపోవడంతో.. సెప్టెంబర్‌లో విడుదల కావడం సంగతి అటుంచితే, అసలు ఈ ఏడాదిలో విడుదలవుతుందా అని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ అలాంటి డౌట్స్ అక్కర్లేదట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయిందని అంటున్నారు. జూన్ నెలాఖరుకి లేదా జూలై నాటికి మొత్తం షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశముందట.

ఇప్పటికే ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సకాలంలో పూర్తయితే సెప్టెంబర్‌లో విడుదల చేయాలని, లేదంటే డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి ఈ ఏడాదిలోనే ‘గేమ్ ఛేంజర్’ విడుదల కావడం ఖాయమని తెలుస్తోంది.