Game Changer: లీకైన గేమ్ ఛేంజ‌ర్ స్టోరీ.. శంక‌ర్ స్టైల్‌లో వెన్నుపోటు పాలిటిక్స్‌

ఈ సినిమా మొద‌లై చాలా రోజులే అవుతున్నా కూడా చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. కాని లీకులు మాత్రం బాగానే వ‌స్తున్నాయి. తాజాగా ఈ మూవీ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Written By:
  • Publish Date - March 20, 2024 / 02:06 PM IST

Game Changer: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఫేమస్ అయ్యాడు రామ్ చరణ్. తన ఇమేజ్‌ను డబుల్ చేసుకునేందుకు శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ చేస్తున్నాడు. ఇటీవలే వైజాగ్‌లో షెడ్యూల్ పూర్తైంది. అక్కడి ఆర్‌కె బీచ్‌లో ఐదు రోజుల పాటు కీలక షెడ్యూల్ ప్లాన్ చేయ‌గా, అక్కడ పెద్ద పొలిటికల్ మీటింగ్ సెట్‌ని కూడా ఏర్పాటు చేసి, షూట్ చేశారు. ఈ సినిమాని పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా శంకర్ తనదైన శైలిలో రూపొందిస్తున్నారు.

Ramcharan upasana : క్లీంకార, ఉపాసనతో గ్లోబల్ స్టార్ షికారు..

అయితే ఈ సినిమా మొద‌లై చాలా రోజులే అవుతున్నా కూడా చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. కాని లీకులు మాత్రం బాగానే వ‌స్తున్నాయి. తాజాగా ఈ మూవీ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈమూవీలో రామ్ చరణ్ తండ్రి, కొడుకులుగా డబుల్ రోల్‌లో నటించనున్నాడు. మెగా ప‌వర్ స్టార్ రామ్ నందన్ అనే ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ కథని ఏకంగా అమెజాన్ ప్రైమ్ లీక్ చేసేసింది. నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్‌గా చరణ్ కనిపించబోతున్నట్లు స్టోరీలైన్ బయటకు రావడంలో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తండ్రిగా రాజకీయాల్లో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్‌లో కనిపిస్తాడని తెలుస్తుంది. పేద ప్రజ‌ల బాగు కోసం ఒక పార్టీని స్థాపిస్తారు. అయితే అత‌నికి స్నేహితుడిగా ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తి వెన్ను పోటు పొడిచి పార్టీని లాక్కుంటాడు. శ్రీకాంత్ తనయుడిగా ఎస్ జె సూర్య నటిస్తుండ‌గా, సూర్య తండ్రిని మించిన రాజకీయ స్వార్థపరుడిగా క‌నిపిస్తాడ‌ట‌. అధికారం ద‌క్కించుకునేందుకు క్రూర‌మైన ఎత్తుగ‌డ‌లు వేసి ప్రజ‌ల‌ని నానా ఇబ్బందుల‌కి గురి చేస్తుంటారట.

అత‌ని ఆలోచ‌న‌లని న‌వీన్ చంద్ర అమ‌లు చేస్తుంటాడ‌ని.. సూర్య త‌మ్ముడి పాత్రలో న‌వీన్ చంద్ర క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. అయితే రామ్ నంద‌న్ తండ్రిలా పొలిటిక‌ల్ లీడ‌ర్ కాకుండా ఐఏఎస్ ఎందుకు అయ్యాడు.. స్వార్థ ప‌రుల నుంచి త‌న తండ్రి పార్టీని ర‌క్షించాడా వంటి అంశాలతో శంక‌ర్ సినిమాని రూపొందించిన‌ట్టు స‌మాచారం. స్క్రీన్ ప్లే మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంద‌ని.. యాక్షన్ ఎపిసోడ్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయ‌ని అంటున్నారు. ఇక గేమ్ ఛేంజర్ సినిమాని సెప్టెంబర్‌లో లేదా డిసెంబర్‌లో రిలీజ్ చేస్తారని సమాచారం. అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.