Ram Charan: మెగా అభిమానులు బీ రెడీ.. గేమ్ చేంజర్ టీజర్ డేట్ ఫిక్స్

ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ మూవీ కోసం మెగా ఫాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ టీజర్.. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చ్ 27న రిలీజ్ కాబోతుందనే టాక్ ఫిలిం సర్కిల్స్‌లో వినపడుతుంది.

  • Written By:
  • Publish Date - February 24, 2024 / 02:22 PM IST

Ram Charan: మెగాపవర్ స్టార్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి రెండు, మూడెళ్లు అవుతోంది. అయినా కూడా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. కనీసం గేమ్ చేంజర్ అప్డేట్ కూడా బయటికి రావడం లేదు. ముందుగా ‘భారతీయుడు 2’ కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు శంకర్. ఈ కారణంగానే గేమ్ చేంజర్ డిలే అవుతోంది. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కాస్త గట్టిగానే అప్సెట్ అవుతున్నారు. అలాంటి అభిమానుల ముఖాల్లో ఆనందం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

PAWAN KALYAN: ఎంపీగా పవన్‌..? పవన్‌ నిర్ణయంతో పిచ్చెక్కిపోతున్న జనసైనికులు

ఎందుకంటే వాళ్లంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రోజు అతిత్వరలోనే రాబోతుంది. మిగతా హీరోలంతా తమ సినిమా అప్‌డేట్స్ విషయంలో చాలా ఫాస్ట్‌గా ఉంటే మా చరణ్ మాత్రం స్లోగా ఉన్నాడేంటి అని ఇక ఫ్యాన్స్ అనుకునే అవకాశం లేదు. ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ మూవీ కోసం మెగా ఫాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ టీజర్.. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చ్ 27న రిలీజ్ కాబోతుందనే టాక్ ఫిలిం సర్కిల్స్‌లో వినపడుతుంది. అలాగే అదే రోజున రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ వస్తుంది. దీంతో మెగా ఫ్యాన్స్ వర్రీ మొత్తం తీరిపోనుంది. మరోవైపు గేమ్ చేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయినా కూడా.. అప్పుడప్పుడు ఈ సినిమా నుంచి లీకైన ఫోటోలు, వీడియోలతో సరిపెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. గతంలో కీలక సన్నివేశాలకు సంబందించిన ఫోటోలు, వీడియోలు చాలా సార్లు లీక్ అయ్యాయి. చెప్పాలంటే.. ప్రతి షెడ్యూల్ నుంచి లీకులు వచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి గేమ్ చేంజర్ నుంచి ఓ వీడియో లీక్ అయ్యింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ హెలికాఫ్టర్‌ సీన్ లీక్ అయినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ ఓ మార్కెట్ ఏరియాలోకి ఏకంగా హెలికాప్టర్‌తో ఎంట్రీ ఇస్తున్నట్టుగా ఈ లీకేజీ చెబుతోంది. దీంతో ఓ యాడ్ షూట్ కోసం వాడిన రామ్ చరణ్ హెలికాప్టర్ షాట్‌ను వైరల్ చేస్తూ.. ఇంతకుమించిన ఎలివేషన్, గూస్ బంప్స్ మ్యూజిక్ పడితే చాలు.. థియేటర్లు దద్దరిల్లిపోతాయ్ అని కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కానీ మేకర్స్.. ఇలాంటి లీకుల్ని ఎందుకు కంట్రోల్ చేయడం లేదని ఫైర్ అవుతున్నారు. ఇలా అయితే కష్టం.. సినిమా మొత్తం లీక్ అయ్యేలా ఉందని అంటున్నారు. మరి గేమ్ చేంజర్ లీకుల్ని ఇప్పటికైనా ఆపుతారేమో చూడాలి.