Game Changer: గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ రేపటి నుంచే.. ఫ్యాన్స్‌ దీంతో సరిపెట్టుకోవాల్సిందేనా..?

లేటెస్ట్‌గా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిందని టాక్. శంషాబాద్‌లో రామ్ చరణ్, సునీల్, నవీన్ చంద్ర కాంబోలో పలు సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. దీంతో.. నెక్స్ట్ షెడ్యూల్ మే 1 నుంచి చెన్నైలో ప్లాన్ చేస్తున్నారట.

  • Written By:
  • Publish Date - April 30, 2024 / 02:21 PM IST

Game Changer: జూన్‌లో ఇండియన్2 సినిమా రిలీజ్ అవుతోంది. కానీ.. గేమ్ చేంజర్ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే విషయంలోనే క్లారిటీ లేదు. ఆ మధ్య నిర్మాత దిల్ రాజు మరో రెండు నెలల్లో షూటింగ్ పూర్తవుతుందని చెప్పాడు. అప్పటి నుంచి రెండు మూడు షెడ్యూల్స్ కొట్టేశాడు శంకర్. కానీ ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. అది కూడా సినిమాలో కీలక ఎపిసోడ్ అని అంటున్నారు.

Naga Chaitanya: సాలిడ్ డీల్.. నాగ చైతన్య సినిమాకు 40 కోట్ల డీల్

ఇంకా కీలక సీన్స్ షూట్ చేస్తున్నారంటే.. ఇప్పట్లో గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తవుతుందా..? అనే డౌట్స్ వస్తున్నాయి. లేటెస్ట్‌గా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిందని టాక్. శంషాబాద్‌లో రామ్ చరణ్, సునీల్, నవీన్ చంద్ర కాంబోలో పలు సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. దీంతో.. నెక్స్ట్ షెడ్యూల్ మే 1 నుంచి చెన్నైలో ప్లాన్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్ చాలా కీలకం అని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే చరణ్ సీనియర్ పాత్రపై వచ్చే సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. అయితే.. ఈ ప్రాజెక్ట్ మొదలై దాదాపు మూడేళ్లు దాటిపోయింది. ఇన్నేళ్లలో ఒక్క టైటిల్ లుక్, రీసెంట్‌గా జరగండి అంటూ ఫస్ట్ సింగిల్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇది తప్పితే.. పెద్దగా అప్టేట్స్ ఇవ్వట్లేదు మేకర్స్. పోనీ రిలీజ్ డేట్ అయినా లాక్ చేశారా అంటే.. అది లేదు.

ఈ సమ్మర్‌లో ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాల అప్టేట్స్‌తో ఖుషీ అవుతున్నారు అభిమానులు. కానీ మెగా ఫ్యాన్స్‌కు మాత్రం ఎలాంటి అప్డేట్స్ లేవు. ఏదైనా ఉంటే.. ఇలాంటి షెడ్యూల్స్ అప్టేట్స్‌తోనే ఫ్యాన్స్ సరిపెట్టుకోవాలి. లేదంటే లీక్డ్ వీడియోలతోనే సంతోష పడాలి. మరి గేమ్ చేంజర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మేకర్స్‌కే తెలియాలి.