Ram Charan: మెగా ఫ్యాన్స్‌ని ఏడిపిస్తారా..? వచ్చే ఏడాది ఆగష్టుకి కూడా చరణ్ మూవీ రాదా..?

నవంబర్ కల్లా దేవర షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఏప్రిల్ 5కి రిలీజ్ అని ఫిల్మ్ టీం తేల్చింది. కాని త్రిబుల్ ఆర్ పార్ట్‌నర్ చరణ్ గేమ్ ఛేంజర్ సంక్రాంతికి కాదు.. సమ్మర్‌కి కాదు. కనీసం వచ్చే ఏడాది ఆగస్టుకి రావటం కూడా కష్టమేనట.

  • Written By:
  • Publish Date - August 19, 2023 / 06:01 PM IST

Ram Charan: త్రిబుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్.. తర్వాత శంకర్ మేకింగ్‌లో సినిమా అంటే ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కాని అది సరైన నిర్ణయం కాదేమో అని ఆలస్యంగా భాధపడుతున్నారు. ఎందుకంటే కొరటాల శివ మేకింగ్‌లో ఎన్టీఆర్ సినిమా మొదలవ్వటానికి ఏడాది ముందే గేమ్ ఛేంజర్ పట్టాలెక్కింది.

కాని ఇంకా రిలీజ్ డేట్ తేలలేదు. ఈలోపు తారక్ దేవర మూవీ 40 శాతం పూర్తైంది. నవంబర్ కల్లా దేవర షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఏప్రిల్ 5కి రిలీజ్ అని ఫిల్మ్ టీం తేల్చింది. కాని త్రిబుల్ ఆర్ పార్ట్‌నర్ చరణ్ గేమ్ ఛేంజర్ సంక్రాంతికి కాదు.. సమ్మర్‌కి కాదు. కనీసం వచ్చే ఏడాది ఆగస్టుకి రావటం కూడా కష్టమేనట. శంకర్ తీస్తున్న భారతీయుడు 2 రిలీజ్ కోసమే సంక్రాంతి సీజన్‌ని దిల్ రాజు వదిలేశాడన్నారు. కాని, భారతీయుడు 2 ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పూర్తవుతుందో తేలలేదు. అలాంటిది ఇక గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏమని ఎక్స్‌పెక్ట్ చేస్తాం.

ఓవైపు అప్‌డేట్స్ లేవు. మరో వైపు విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేదు. వస్తున్న లీకుల ప్రకారం చూస్తే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నా.. దిల్ రాజు గేమ్ ఛేంజర్‌ని వచ్చే ఏడాది దసరాకు ప్లాన్ చేస్తున్నాడట. 2024 ఆగస్ట్ 15 కి భారతీయుడు 2, 2024 దసరాకు గేమ్ ఛేంజర్ అనుకోవాల్సి వస్తోంది. అదే నిజమైతే మరో ఏడాది వరకు మెగా ఫ్యాన్స్‌కి నిరీక్షణ తప్పదంతే.