Ram Gopal Varma: తాను దేని గురించి పట్టించుకోను అంటూనే ప్రతీ విషయాన్ని పట్టించుకుంటారు దర్శకుడు ఆర్జీవి. మిగతా వ్యక్తులతో కంపేర్ చేస్తూ ప్రతీ విషయంలో ఆర్జీవీ రియాక్ట్ అయ్యే తీరు కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతీ విషయాన్ని లాజిక్‌తో ముడిపెట్టి ఎదుటి వ్యక్తిని తికమకపెట్టడంలో దిట్ట. అందుకే విషయం ఏదైనా ఆర్జీవీ మాట్లాడితే అది వైరల్‌గా మారుతుంది. ఇప్పుడు ఇండియా పేరును భారత్‌గా మార్చడం గురించి కూడా అలాంటిదే ఓ ట్వీట్ చేశాడు ఆర్జీవీ.
హాలీవుడ్ డైరెక్టర్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఇండియానా జోన్స్ సినిమాను భారత్‌నా జోన్స్ అంటూ ఎడిట్ చేశారు. ఇండియా పేరును భారత్‌గా మార్చారు.. కాబట్టి ఇప్పుడు ఇండియానా జోన్స్‌ను భారత్‌నా జోన్స్ అంటూ పిలవాలా అంటూ ఫన్నీ ట్వీట్ చేశారు. ఇండియానా జోన్స్ సినిమాలో హీరో ఫేస్‌ను తన ఫొటోతో మార్ఫింగ్ చేసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఆర్జీవి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫొటోకు నెటిజన్లు వింత వింత కామెంట్లు పెడుతున్నారు.