RAM GOPAL VARMA: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఏఐలో ఓ భాగం అయిన డీప్ ఫేక్ టెక్నాలజీతో.. జరుగుతున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. మంచే కాదు.. చెడు కూడా ఎక్కువే అన్నట్లు ఉంది ఆ డీప్ ఫేక్ టెక్నాలజీతో! దీని ద్వారా టెక్నాలజీలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయ్. సరికొత్త సాంకేతికతను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరో మెట్టు ఎక్కించింది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త వీడియోలు, ఫోటోలు రీక్రియేట్ చేయటం ఒక ట్రెండ్‌గా మారింది.
Namrata Shirodkar: నమ్రత.. ఎందుకిలా..? జగన్ ప్లస్ మహేశ్ బాబు.. ఏం జరిగింది..?
సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఏఐ రీక్రియేటెడ్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించి.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి హాలీవుడ్ హీరోలా రీక్రియేట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ మధ్యే శోభన్‌బాబుకు సంబంధించిన ఏఐ వీడియోను కూడా ఆర్జీవీ షేర్ చేశాడు. ఏదేమైనా ఈ వీడియో మాత్రం అదుర్స్ అనిపిస్తోంది. ఇప్పటి హెయిర్ స్టయిల్స్, కండలు, టోన్డ్ ఫేస్, ట్రెండీ దుస్తుల్లో ఉన్న ఏఐ అక్కినేనిని ఈ వీడియోలో చూడొచ్చు. ఆర్టిఫిషియల్ ఏఎన్నార్‌ను ఎంతో ఇంటెలిజెంట్‌గా క్రియేట్ చేశారని వర్మ ఈ వీడియోపై రాసుకొచ్చాడు. అక్కినేని కుటుంబానికి, ఆర్జీవీకి మంచి అనుబంధం ఉంది.
ఎప్పుడూ ఏడవని ఆర్జీవీ.. ఆ మధ్య వంగవీటి ప్రెస్‌మీట్‌లో నాగార్జున గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. శివ ద్వారా తనకు వచ్చిన అవకాశం గురించి చెప్తూ.. కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు. ఇదంతా ఎలా ఉన్నా.. టెక్నాలజీని అందుకోవడంలో.. ఆర్జీవీ తర్వాతే ఎవరైనా. ఇప్పుడు షేర్ చేస్తున్న ఫొటోలే అందుకు సాక్ష్యం అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. వరుస పెట్టి పాత హీరోల ఏఐ ఫొటోలు షేర్ చేస్తున్నాడంటే.. ఆర్జీవీ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అని డౌట్ పడేవాళ్లు ఇంకొందరు మరి.
INTELLIGENTLY created ARTIFICIAL ANR 🙏 pic.twitter.com/dfRUpKpEGI
— Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2024