RAM GOPAL VARMA: నన్ను వాడుకొని వదిలేశారు.. ఆర్జీవీ సంచలన ట్వీట్‌…

ఎప్పుడూ ఎవరినో నిలదీసినట్లు కనిపించే ఆర్జీవీ ట్వీట్లు.. ఈసారి కొత్తగా అనిపించాయ్. అన్ని రాజకీయాల వెనుక ఉన్న సింగిల్ లైన్ స్టోరీ ఇదే అంటూ ఒక పాయింట్ చెప్పాడు. ఇప్పుడు ఇది అత్యంత హాట్ టాపిక్‌గా మారింది.

  • Written By:
  • Publish Date - January 8, 2024 / 03:34 PM IST

RAM GOPAL VARMA: ట్విట్టర్‌లో యుద్ధం చేయొచ్చని.. ట్వీట్‌ను ఆయుధంగా వాడుకోవచ్చని.. ఆర్జీవీ పరిచయం చేశాడు చాలామందికి! రెండు లైన్లు మనోడు ట్వీట్ చేశాడంటే.. రెండు వందల వివాదాలు వెతుక్కోవచ్చు అందులో! అటు ఇండస్ట్రీని, ఇటు రాజకీయాలను.. తనదైన శైలిలో ఆడుకోవడం ఆర్జీవీకి ఒక్కడికే చెల్లింది. ఆయన ట్వీట్లు.. మీడియాలో ఎప్పుడూ చర్చకు కారణం అవుతుంటాయ్. అందులో కొన్ని ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ అటాక్‌గా ఉంటే.. మరికొన్ని మాత్రం అత్యంత లోతుగా ఆలోచిస్తే తప్ప అర్ధం కావు అన్నట్లుగా ఉంటాయ్.

Salaar 2 : సలార్‌-2 రిలీజ్‌పై నిజమేనా..?

మరికొన్ని ట్వీట్లు ఎవరిని ఉద్దేశించి పెట్టారనేది తెలిసినా చెప్పలేని విధంగా ఉంటాయ్‌. ఎప్పుడూ ఎవరినో నిలదీసినట్లు కనిపించే ఆర్జీవీ ట్వీట్లు.. ఈసారి కొత్తగా అనిపించాయ్. అన్ని రాజకీయాల వెనుక ఉన్న సింగిల్ లైన్ స్టోరీ ఇదే అంటూ ఒక పాయింట్ చెప్పాడు. ఇప్పుడు ఇది అత్యంత హాట్ టాపిక్‌గా మారింది. ఇది జనాలను, ప్రభుత్వాలను ఉద్దేశించి చేశారా.. లేక, నాయకులతో పార్టీలకు ఉండే సంబంధాలను ప్రస్తావిస్తూ చెప్పారా అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది. తనను వాడుకొని వదిలేశారు అనే అర్థం వచ్చేలా ఆర్జీవీ ట్వీట్ ఉంది. వర్షం ఆగిపోయిన తర్వాత అంతవరకూ రక్షణగా నిలిచిన గొడుగు కూడా భారంగా మారుతుంది. అవసరాలు ఆగిపోతే విశ్వాసం కూడా అంతమవుతుందని ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు. ఐతే ఇప్పుడు దీన్ని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు నేతలు జనాలు. జగన్ పేరుతో గెలిచి.. ఇప్పుడు టికెట్ రాలేదని పార్టీని విడిచిపోతున్న నేతలను ఉద్దేశించి.. ఆర్జీవీ ఇలాంటి ట్వీట్‌ చేశాడా అనే చర్చ జరుగుతోంది.

ఐతే ఇలాంటి ట్వీటే.. క్రికెటర్‌ పొలార్డ్ చేశాడు. సేమ్‌ ఇమేజ్‌ను కాపీ చేసి.. ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు ఆర్జీవీ. ఇదంతా ఎలా ఉన్నా.. ఇలాంటి డీప్‌ ట్వీట్ తర్వాత.. మరో సెటైరికల్ ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఇందులో నేరుగా.. పాలిటిక్స్‌లో సింహమే సింగిల్‌గా వస్తుంది.. పందులు గుంపుగా వస్తాయి.. విశ్వధాబిరామ వినుర చంద్రమా అని చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేశారు రాంగోపాల్ వర్మ.