BARRELAKKA: ఆర్జీవీ గురించి తెలిసిందేగా.. ఆయన అదో రకం జీవి. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. అమెరికా విషయాల నుంచి అంబాజీపేట వివాదాల వరకు.. ప్రతీదాంట్లో ఫింగరింగ్ పెడుతుంటారు వర్మ. వర్మను వోడ్కా నడిపిస్తుందో.. నడిచేందుకు వర్మ వోడ్కాను నమ్ముకుంటాడో తెలియదు కానీ.. ఆయన ప్రతీ మాట, ప్రతీ ట్వీట్ వివాదమే ! వ్యూహం అని సినిమా తీసి.. కోర్టు తీర్పుతో దాన్ని పక్కన పెట్టిన వర్మ.. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ మీద పడ్డాడా అంటే.. అవును అనే అనిపిస్తోంది.
PM MODI: విదేశాల్లో పెళ్లిళ్లు అవసరమా..? ఫారిన్ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు..
సోషల్ మీడియా ట్రెండింగ్ ఇష్యూ మీద రియాక్ట్ కావడం.. తాను ట్రెండింగ్‌లోకి వెళ్లడం ఆర్జీవీకి కొత్తేం కాదు. ఇప్పుడు కూడా అదే చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు.. బర్రెలక్క. కొల్లాపూర్ నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్కపై.. ఆర్జీవీ కూడా ఆసక్తికర ట్వీట్ చేశాడు. బర్రెలక్క.. నేటి మహాత్మాగాంధీ అంటూ రాసుకొచ్చాడు ఆర్జీవీ. ఆనాడు జాతిపిత మహాత్మ గాంధీ కూడా బర్రెలక్కలానే అన్యాయాన్ని ఎదిరిస్తూ ఉద్యమానికి తెర లేపారని గుర్తు చేశారు. బర్రెలక్కను మహాత్మ గాంధీతో పోల్చుతూ.. తన ధైర్యానికి సలాం అంటూ వర్మ ప్రశంసలు గుప్పించాడు. ఎప్పుడూ.. రాజకీయ నాయకులపై విమర్శలు చేసే ఆర్జీవీ.. మొట్టమొదటిసారి ఓ సామాన్యురాలి గురించి.. అది కూడా పాజిటివ్‌గా పొగుడుతూ ట్వీట్ చేయటం.. ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఐతే పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క ఎంతోమేలని కూడా ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇక అటు బర్రెలక్కకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు కనిపిస్తోంది. దేశ విదేశాల్లో ఉన్న చాలామంది.. ఎన్నికల ప్రచారం కోసం ఆమెకు విరాళాలు పంపిస్తున్నారు. అటు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా బర్రెలక్కకు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ లీడర్, హీరో రాజా కూడా బర్రెలక్కకు మద్దతు ప్రకటించారు. తమ పార్టీ తిట్టినా బర్రెలక్క గెలివాలని హీరో రాజా ఆకాంక్షించారు.