RGV VYOOHAM: ఏపీ సీఎం జగన్ జీవితం ఆధారంగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (RAM GOPAL VARMA) తీసిన వ్యూహం (VYOOHAM) సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకోవాలంటూ నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టుతో పాటు ఏపీ హైకోర్టు కూడా స్వీకరించాయి. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించడంతో.. ఆర్జీవి కూడా తన లాయర్ ద్వారా కౌంటర్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Guntur Kaaram Review: ఇలా చేసావేంటి రమణా..? గురూజీని.. కుర్చీ మడతపెట్టి..!
జనవరి 22న సినిమా రిలీజ్‌కు సంబంధించి కీలక తీర్పు చెప్పబోతోంది. ఈ సినిమాలో చంద్రబాబును నెగటివ్‌గా చూపించారని.. ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా క్యారెక్టర్‌ను డిజైన్ చేశారంటూ నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యూహం సినిమా ట్రైలర్‌ను ఎవిడెన్స్‌గా సబ్మిట్ చేశారు. ఈ సినిమా ఎఫెక్ట్ వచ్చే ఏపీ ఎన్నికలపై పడే ఛాన్స్ ఉందంటూ చెప్పారు. వెంటనే సినిమా రిలీజ్‌ను అడ్డుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. లోకేష్ వాదనతో ఏకీభవించిన కోర్టు.. సినిమా రిలీజ్‌ను తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ సినిమాతో ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉండదంటూ ఆర్జీవీ తరఫు లాయర్లు చెప్తున్నారు. కోర్టు అనుమతిస్తే ఏపీలో కాకుండా తెలంగాణలో సినిమా రిలీజ్ చేసుకుంటామంటూ చెప్పారు. కానీ ఒక్కసారి సినిమా రిలీజైతే ఏపీ తెలంగాణ తేడా లేకుండా సినిమా ప్రతీ ఒక్కరి దగ్గరికి వెళ్లపోతుందంటూ లోకేష్ లాయర్లు డిఫెన్స్ వాదనలో తెలిపారు.
దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఏపీ హైకోర్ట్ ఓ అభిప్రాయానికి వచ్చింది. సినిమా రిలీజ్‌కు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుని.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 22న ఈ కేసులో తీర్పు చెప్తామంటూ ప్రకటించింది. దీంతో వ్యూహం సినిమా వస్తుందా లేదా అనే విషయం ఈ నెల 22న తెలియబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా విజయవాడలో గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. మరి సినిమా పరిస్థితి ఏంటో చూడాలి.
RGV