తెలుగు జనాలకు రాముడన్నా, కృష్ణుడన్నా, కర్ణుడైనా, యముడైనా, ఇలా దేవడి పాత్రలేవైనా అన్నీ ఎన్టీఆరే… కాకపోతే ఇప్పుడా లెక్కమారింది. దేవడంటే ఇలా ఉంటాడని సీనియర్ ఎన్టీఆర్ తన పాత్రలతో చూపిస్తే, ఈ తరానికి దేవున్ని పరిచయం చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. పాత తరానికి ఎన్టీఆరే దేవుడు కావొచ్చు.. ఈ జనరేషన్ కి మాత్రం రాముడంటే రెబల్ స్టారే… కర్ణుడంటే కూడా ప్రభాసే… ఐతే కృష్ణుడి పాత్ర వేయకున్నా, తానే కృష్ణుడిగా ఫోకస్ అవుతున్నాడు ప్రభాస్. ఆల్రెడీ కల్కీ అవతారంతో బిజీ అయ్యాడు. కాబట్టి ఈతరానికి తానే కల్కి అన్నా అర్ధముంది… కాని వేయని పాత్రలో పాతుకుపోయిన మొదటి హీరోగా రెబల్ స్టార్ పేరు మారుమోగుతోంది. కృష్ణావతారంలో కనిపించాడు కాబట్టే, ఎన్టీఆర్ ని కృష్ణుడిగా భావించారు అప్పటి జనం. ఇప్పటి తరం కూడా రాముడు, కర్ణుడిగా కనిపించాడు కాబట్టే ప్రభాస్ ని నయా రాముడు, నయా కర్ణుడంటున్నారు. కాని విచిత్రంగా ఇంతవరకు కృష్ణుడి పాత్ర వేయకున్నా తననే రెబల్ కృష్ణుడంటున్నారు. కారణం కల్కీ 2నే… ఐతే ఈవిషయంలో మొదటి నుంచి రెబల్ స్టార్ దారిలోనే నడిచిని యశ్ ఈసారి, ప్రభాస్ తో పాటు ఎన్టీఆర్ ఇన్స్ పిరేషన్ తోనే, సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు. సో ప్రభాస్ ఎందుకు కృష్ణుడయ్యాడో, యశ్ కి ఎలా ఎన్టీఆర్ ఇన్స్ పిరేషనో చూసేయండి.
రాముడంటే ఎన్టీవోడే… కృష్ణుడంటే ఎన్టీవోడే… ఇలా దాన వీర వూర కర్ణ…. లేదంటే అర్జున.. కాదంటే రావణ ఇలా బ్లాక్ అండ్ వైట్ నుంచి నైంటీస్ వరకు దేవుడంటే ఎన్టీఆరే అనుకునే వాళ్లు. దేవుడి పాత్రలని తన రూపంలో అంతగా ఇమిడేలా చేశాడు లెజెండ్ ఎన్టీఆర్… కాకపోతే ఈ తరానికి రాముడు, కృష్ణుడు, కర్ణుడు ఇలా ఈ పాత్రలన్నీంటికి మూలపురుషుడు రెబల్ స్టారే అనాల్సి వస్తోంది.
ఆదిపురుష్ హిట్ కాకున్నా, మేకింగ్ పరంగా హీరోని దర్శకుడు మోసం చేశాడనే కామెంట్స్ వచ్చినా రాముడి పాత్రలో రెబల్ స్టార్ మతిపోగొట్టాడు. ఫస్ట్ టైం రాముడికి మీస కట్టు పెట్టినా, ఆ లుక్కు కిక్కిచ్చిందంటే అది రెబల్ స్టార్ గంభీరమైన లుక్ మహిమే… ఇది కాకుండా కల్కీ లో ఆ హైటుతో గాండీవం పట్టుకుని, కర్ణుడిగా రూపం మార్చగానే, ఆడియన్స్ లో గూస్ బంబ్స్ వచ్చాయి.
ఈ జెనరేషన్ లో ఓ హీరో పౌరాణీక పాత్ర వేస్తే జనానికి నచ్చటమే గొప్పనుకుంటే, విజిల్స్ పడటం, వసూల్ల వరద రావటం రికార్డే… అందుకే ఈ తరానికి రాముడైనా, కర్ణుడైనా పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టారే… ఇక కల్కీలో కలిగా కూడా కనిపించబోయేది తానే అన్నారు. కలి మొదటి భాగంలో కర్ణుడిగా కనిపించిన తానే కల్కీ 2 లో కలి అవతారంతో షాక్ ఇవ్వబోతున్నాడు.
ఇవన్నీ ఓకే కాని ఇంతవరకు రెబల్ స్టార్ వేయంది లార్డ్ కృష్ణుడి పాత్ర… అయినా తనని ఈ తరం కృష్ణుడనటానికి కారణం, రాధేశ్యామ్… ఇందులో తను జోతిష్కుడి పాత్రే వేసినా, తను కృష్ణుడి అంశ అంటూ ప్రచారం జరగటం. ఈ సినిమా రిజల్ట్ కలిసి రాకున్నా, బయట జనాల్లో మాత్రం ప్రభాస్ కటౌట్ అలా కృష్ణుడి ఇమేజ్ ని సొంతం చేసుకుంది.
ఇక కల్కి 2 లో కృష్ణుడిగా కూడా ఓ సీన్ ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. నాగ్ అశ్విన్ కూడా ఈ ప్రశ్నకు నవ్వి ఉరుకున్నాడు. కాని ఏది తేల్చలేదు. కాబట్టి కల్కీ లో కర్ణుడిగా షాక్ ఇచ్చిన ప్రభాస్, కల్కి 2 లోకల్కిగా అలానే కృష్ణుడిగా కూడా కనిపించటం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది
యముడిగా, ఎస్వీఆర్, ఎన్టీఆర్, కైకాల తర్వాత, కోటా ఇలా ఇంతమంది పాత తరానికి యముడిగా పరిచయం అయితే, ఈ తరానికి యంగ్ యమగా షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్… తాత దారిలో యముడి గెటప్పులో టాప్ లేపాడు.. ఐతే సీనియర్ ఎన్టీఆర్ , జూనియర్ ఎన్టీఆర్ ప్రేరణతో కన్నడ హీరో యశ్ కూడా అదే రూట్లో నడుస్తున్నాడు. రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హిందీ మూవీలో రావణుడిగా యశ్ కనిపించబోతున్నాడు. ఇదొక్కటే కాదు మరో పౌరాణికంలో అర్జునుడిగా కనిపించేందుకు సిధ్ధమయ్యాడు. ఈతరంలో కూడా పౌరాణికి పాత్రల్లో కనిపిస్తే కాసుల వర్షం కురుస్తుందని యమదొంగ, ఆదిపురుష్, కల్కీ తో ప్రూవ్ అయ్యింది. కాబట్టే వరుసగా కేజీయఫ్ ఫేం రాఖీ భాయ్ ఈ రూట్లో ప్రయోగాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్, ప్రభాస్ తనకి ప్రేరణ అని తేల్చాడు.