GUNTUR KARAM: మాస్ వార్నింగ్.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి..

తమ హీరోకి తమన్ మంచి మ్యూజిక్ ఇవ్వట్లేదంటూ కొందరు మహేష్ బాబు అభిమానులు విరుచుకుపడుతున్నారు. సంగీతంతో పాటు 'ఓ మై బేబీ' పాట సాహిత్యం కూడా బాలేదంటూ ఫైర్ అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - December 15, 2023 / 02:40 PM IST

GUNTUR KARAM: ‘గుంటూరు కారం’ సినిమా నుంచి విడుదలైన రెండో పాట ‘ఓ మై బేబీ’పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. తమ హీరోకి తమన్ మంచి మ్యూజిక్ ఇవ్వట్లేదంటూ కొందరు మహేష్ బాబు అభిమానులు విరుచుకుపడుతున్నారు. సంగీతంతో పాటు ‘ఓ మై బేబీ’ పాట సాహిత్యం కూడా బాలేదంటూ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పాట రాసిన ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ వేదికగా కాస్త ఘాటుగానే స్పందించారు.

SALAAR: సెన్సార్ నివేదిక.. సలార్‌కి పాజిటివ్ రివ్యూలు.. ఫ్యాన్స్‌కి పండుగే!

“సోషల్ మీడియా రోజురోజుకి దారుణంగా తయారవుతోంది. విషయంపై పూర్తి అవగాహన లేకుండానే కామెంట్, జడ్జ్ చేయొచ్చని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు. దురుద్దేశాలతో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. సాంకేతిక నిపుణులను టార్గెట్ చేస్తున్నారు. ఇది అసలు మంచి పద్ధతి కాదు. ఎవరో ఒకరు మాట్లాడాలి. గీతలు దాటుతున్నారు వీళ్ళు” అంటూ ఫైరయ్యారు. “ప్రతివాడు మాట్లాడేవాడే. రాయి విసిరే వాడే. అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని. మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా. అదే లేకపోతే.. ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం.

తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. సక్రమంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దానిని స్వాగతిస్తాము. కానీ పద్ధతి మీరకండి.” అంటూ రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు. ప్రస్తుతం రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.