RAMAYAN MOVIE:ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మరో రామాయణం తెరకెక్కబోతోంది. హిందీతో పాటు భారతీయ భాషలన్నింటిలోనూ ఈ రామాయణం అలరించబోతోంది. ఐతే ఈసారి రాముడు మాత్రం డిఫరెంట్. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా.. కేజీఎఫ్ యష్ రావణాసురుడిగా మరో ప్రయోగం జరుగుతోంది. ఈ కొత్త సీతారాముళ్లు జనాన్ని ఎలా అలరిస్తారో చూడాలి. రామాయణం అంటే భయపెట్టే స్థాయికి ఆదిపురుష్ తీసుకెళ్లింది. ఎన్నో వివాదాలు.. ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. మరి నితీష్ తివారీ తెరకెక్కించే రామాయణం ఎలా ఉండబోతుందో చూడాలి.
Rajadhani Files Review: ఆవేదనకి సాక్ష్యం.. రాజధాని ఫైల్స్.. రైతుల కన్నీటి గాథ
ప్రభాస్ రాముడిగా.. కృతిసనన్ సీతగా నటించిన ఆదిపురుష్ టీజర్ రిలీజ్ కావడం ఆలస్యం ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. వానర సైన్యాన్ని కింగ్‌కాంగుల్లా, రావణాసుడిని టెర్రరిస్టుగా చూపించాడంటూ ఓంరౌత్‌పై విమర్శల దాడి జరిగింది. దీన్నుంచి దర్శకుడు ఇంతవరకు కోలుకోలేదు. ఆదిపురుష్ వచ్చి వెళ్లిపోయినా.. ఓంరౌత్‌ను మాత్రం మర్చిపోలేకపోతున్నారు ఆడియన్స్. అద్భుతం సృష్టిస్తాడనుకుంటే.. చిన్న పిల్లలకు నచ్చేలా కూడా సినిమా తీయలేకపోయాడు. హనుమాన్ రిలీజై బాక్సాఫీస్‌ను కొల్లగొడుతుంటే.. సినిమా ఎలా తీయాలో ప్రశాంత్ వర్మను చూసి నేర్చుకో అంటూ ఆమధ్య మళ్లీ ట్రోలింగ్ చేశారు. ఐతే ఇప్పుడు బాలీవుడ్ మరో రామాయణం రెడీ చేస్తోంది. చాలాకాలంగా నితీష్ తివారి రామాయణం గురించి చర్చ నడుస్తోంది. ముందు సీతగా దీపిక పదుకొనేని.. రావణాసుడిగా హృతిక్ రోషన్‌ను సంప్రదించాడు దర్శకుడు. రెండేళ్ల పాటు డేట్స్ లాక్ అవుతాయనున్న హృతిక్.. రామాయణంకు సైన్ చేయలేదు. ఫైనల్‌గా రాముడుగా రణ్‌బీర్ కపూర్.. సీతగా సాయిపల్లవి పేర్లు వినిపిస్తున్నాయ్. హనుమంతుడి పాత్రలో దేవదత్.. కుంభకర్ణుడిగా బాబి డియోల్‌ని ఎంపిక చేసినట్లు ప్రచారం సాగుతోంది.
CHIRANJEEVI: ‘అల్లు’కి దూరంగా.. మెగా హీరోలు..
ఇక రావణాసుడిగా యష్ పేరు తెరపైకి వచ్చింది. కేజీఎఫ్ 2 తర్వాత రెండేళ్లు ఖాళీగా ఉన్న యశ్.. ఈమధ్యనే కొత్త సినిమా స్టార్ట్ చేశారు. యశ్‌కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి రామాయణంలో తీసుకున్నారట. షూటింగ్ ఏప్రిల్‌లో మొదలవుతుందని తెలిసింది. ఎలాంటి వివాదాలకు తావులేకుండా స్క్రిప్ట్ సిద్ధం చేశానని డైరెక్టర్ ఓ సందర్భంలో చెప్పారు. ఈ సంపూర్ణ రామాయణాన్ని మూడు భాగాలుగా తీస్తారని సమాచారం. మహాభారతం తీయడం రాజమౌళి టార్గెట్ అయితే.. ప్రేక్షకులు మాత్రం ఆయన్నుంచి రామాయణం అడుగుతున్నారు. రామాయణ మహాకావ్యాన్ని 1987లో ధారావాహికగా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు రామానంద సాగర్. ఈ సీరియల్‌ను ప్రేక్షకుల కోరిక మేరకు లాక్‌డౌన్ కారణంగా.. పునఃప్రసారం చేస్తే మంచి రేటింగ్స్ కూడా వచ్చాయ్. నెటిజన్లు ట్విట్టర్ వేదికగా రాజమౌళి సర్ రామాయణం తీయడంటూ ట్వీట్స్ చేస్తున్నారు. రాజమౌళి మేక్ రామాయణ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి దూసుకుపోయింది ఆ మధ్య.
అయితే దీనిపై రాజమౌళి ఇంతవరకు రియాక్ట్ కాలేదు. రాజమౌళి కథల్లో ఎమోషన్స్.. యాక్షన్ సీన్స్ భారీగా ఉంటాయ్. హీరోయిజం.. విలనిజన్ని పతాకస్థాయిలో చూపిస్తాడు. ఇవన్నీ రామాయణంలో కంటే.. మహాభారతంలో పుష్కలంగా ఉంటాయ్. అందుకే.. జక్కన్న దృష్టి భారతంపై పడి.. ఎప్పటికైనా మహాభారతం తీస్తానన్నాడు. మహేశ్‌తో తీయనున్న సినిమా పూర్తై.. రిలీజ్ కావడానికి మినిమం రెండేళ్లు తీసుకుంటాడు జక్కన్న. ఈ లెక్కన నితీష్ తివారి రామాయణం ఎలా వుంటుందో చూడాలి మరి.