Ramcharan: గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్పుడేనా..? ఆనందంలో మెగా ఫ్యాన్స్‌..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ గేమ్ ఛేంజర్. ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్‌కి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్‌గా మారింది.

  • Written By:
  • Publish Date - January 18, 2024 / 01:38 PM IST

Ramcharan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ గేమ్ ఛేంజర్. భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ప్రమోషనల్ వీడియోస్.. సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తున్నాయి. అందుకే ఈ సినిమా నుంచి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్‌కి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్‌గా మారింది.

Mega Star Chiranjeevi: చిరంజీవికి పద్మ విభూషణ్.. మెగా సంబరం..?

పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా దర్శకుడు శంకర్ అద్భుతంగా గ్రాండియర్ లెవెల్లో చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిస్తోంది. శంకర్ స్పీడ్ చూస్తుంటే.. గేమ్ ఛేంజర్ మూవీని అక్టోబర్ 2న గాంధీ జయంతి లేదా అక్టోబర్ 12న దసరా సందర్భంగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారంటూ ఓ వార్త వినిపిస్తోంది. అయితే.. దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి కన్‌ఫర్మేషన్ రానప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం ఈ డేట్‌కే రిలీజ్ అంటూ ఫిక్సయిపోయి సంబరాలు చేసుకుంటున్నారు. భారీ లెవల్లో గ్రాండ్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా చెర్రీ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పక్కన జంటగా కియారా అద్వానీ నటిస్తోంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. మరి.. ఈ మూవీకి సంబంధించి వైరల్‌ అవుతున్న వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మేకర్స్‌ స్పందించాల్సిందే.