చిరంజీవి కొడుకు కాకపోతే ఇంత పెద్ద స్టార్ అయ్యేవారా అని అడిగిన ప్రశ్నకు చాలా మంచి సమాధానం చెప్పాడు చరణ్. నిజానికి నెపోటిజం అనే మాట తనకు అర్థం కాదని ఆన్సర్ చెప్పాడు చరణ్. సినిమాల్లో బ్యాగ్రౌండ్ అనేది కేవలం ఎంట్రీ పాస్‌గా మాత్రమే పనికి వస్తుందని.. సినిమాల్లో రాణించాలంటే టాలెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందేన్నారు. డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలి అనుకోవడంలో తప్పు లేనప్పుడు హీరో కొడుకు హీరో కావాలి అనుకోవడంలో తప్పేంటని ప్రశ్నించాడు. బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లు కాస్త త్వరగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు.. లేని వాళ్లకు కాస్త లేట్ అవుతుంది.. కానీ ఫీల్డ్ లోకి వచ్చాక టాలెంట్ ఉన్నవాళ్లే నిలబడగలుగుతారని చెప్పాడు.
టాలెంట్ లేనప్పుడు ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా వేస్ట్ అంటూ కొట్టిపారేశాడు. తాను చిన్నప్పటి నుంచి సినిమాలే ఊపిరిగా బతికానంటూ చెప్పాడు చరణ్. తన తండ్రి నుంచి చాలా నేర్చుకున్నానని.. అందుకే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటూ సమాధానం చెప్పాడు. ప్రజలు ఆశీర్వదిస్తే స్టార్స్ అవుతారే తప్ప వెనక ఎవరో ఉన్నారని స్టార్ అయ్యేందుకు చాన్స్ లేదన్నాడు. నెపోటిజం అనే మాటే అబద్ధమని.. ఇది కొందరు వ్యక్తులు క్రియేట్ చేసిన ప్రొపగండా అంటూ చెప్పాడు. ఎలాంటి బ్యాంగ్రౌండ్ లేకుండా వచ్చిన యష్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదగలేదా అంటూ ఆన్సర్ ఇచ్చాడు. టాలెంట్ ఉన్నవాళ్లకు బ్యాగ్రౌండ్ అవసరంలేదని.. బ్యాగ్రౌండ్ ఉన్నా టాలెంట్ లేకపోతే వేస్ట్ అంటూ సింపుల్ ఈక్వేషన్ ఇచ్చాడు చరణ్.