వెంకటేశ్ కెరీర్‌కు 36 ఏళ్లు. వెంకటేశ్ సినిమాలను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చన్న బలమైన నమ్మకాన్ని కలిగించాడు. ఇప్పటికీ ఫ్యామిలీ ముద్ర చెరిగిపోకుండా.. దృశ్యం.. నారప్ప వంటి సినిమాల్లో కూడా నటించాడు. ఇంత మంచి ఫ్యామిలీ ఇమేజ్ వున్న వెంకటేశ్ ‘రానా నాయుడు’లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరమయ్యాడు.
వెంకటేశ్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ రీసెంట్‌గా స్ట్రీమింగ్ అయింది. బండ బూతులు… రొమాంటిక్ సీన్స్… హార్డ్‌గా అనిపించే క్యారెక్టరైజేషన్స్ మధ్య వెంకటేశ్
కనిపించడానికి ఫ్యామిలీ ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. అసలు కుటుంబంతో కాదు కదా సింగల్ గా కూడా చూడలేనేంత బండ బూతులున్న ఈ వెబ్ సిరీస్‌లో ఫ్యామిలీ హీరో ఎందుకు నటించాల్సి వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు.
యు సర్టిఫికేట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా వుండే వెంకీ ఇలాంటి సిరీస్ ఎలా చేశాడంటూ అభిమానులే మండిపడుతున్నారు. బాలీవుడ్ ఇమేజ్ వున్న యంగ్ హీరో రానాకు సూట్ అవుతుందిగానీ.. ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఇమేజ్ వున్న వెంకీకి సూట్ కాలేదు. వెబ్ సిరీస్‌లో అన్నీ ఎక్కువే వుంటాయి. సెన్సార్ వుండదు కాబట్టి.. గ్లామర్… స్కిన్‌షో.. బూతులు.. రక్తపాతం అన్నీ ఓవర్‌గానే చూపిస్తారు. అయితే.. పద్దతి గల వెబ్ సిరీస్‌లు కూడా వుంటాయి.
వెంకటేష్ లాంటి ఫ్యామిలీమేన్ బూతుల ప్రపంచంలోకి ఎలా ఇరుక్కుని పోయాడో అంతుపట్టడం లేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాపాడుకుంటున్న ఫ్యామిలీ ఇమేజ్‌ను రానా నాయుడు మంటగలిపింది. వెంకీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో బాగానే వున్నా.. ఫ్యామిలీతో కలిసి చూసే వెబ్ సిరీస్ కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రానా వెంకటేష్ ఎండీ జరిగే సంభాషణలు మరీ నీచంగా ఉన్నాయి. పుబ్లిచిత్య్ ఇంటర్వూస్ లో వెంకటేష్ స్వయం గా ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీస్ తో చూడవద్దని రిక్వెస్ట్ చేసాడు. వాళ్ళకే అంత గోరంగా అనిపించిన్నదన్నమాట. రానా నాయుడుతో వచ్చిన బ్యాడ్ ఇంప్రెషన్ వెంకటేష్ కి ఇప్పట్లో పోదు.