తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మంది నటులకు ఉంటుంది. అందరిలాగే రానా దగ్గుబాటికి సైతం ఆయనతో నటించాలనే పెద్ద డ్రీమ్ అని, అది వేట్టయాన్ సినిమాతో తీరిందని చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న టాలీవుడ్ హీరో రానా రజనీకాంత్, కల్కి, రాజమౌళిల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
జై భీమ్ చిత్రాన్ని తెరకెక్కించిన టి.జె. జ్ఞానవేల్ ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చిందని వెంటనే ఒప్పుకున్నా అని అన్నారు. ఈ చిత్రం రజనీ స్టైల్‌లో ఉండే చిత్రం కాదని జ్యుడిషియల్, పోలీసు వ్యవస్థ అంశాల నేపథ్యంలో రూపోందుతుందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. చివరి దశలో చత్రీకరణ ఉందని ఈ ఆక్టోబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
అలాగే కల్కి చిత్రం హలీవుడ్ అవెంజర్స్ రేంజ్‌లో ఉంటుందని.. ప్రేక్షకులందరూ కనెక్ట్ అవుతారిన పేర్కొన్నారు. కల్కి ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొనడంతో రానా సైతం ఆ చిత్రంలో ఉన్నాడనే వార్తలు వినిపించాయి అందులో వాస్తవం లేదని చెప్పారు. అలాగే డైరెక్టర్ రాజమౌళి గురించి మాట్లాడుతూ… ఆయనతో నాకు మంచి స్నేహం ఉందని, రాజమౌళి ఎప్పుడు మార్కెట్, రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోడని, అలాగే కాలంతో కూడా పనిలేదని, ఎన్ని సంవత్సరాలు అయినా మంచి ప్రోడక్ట్ ప్రేక్షకులకు అందించడమే పనిగా పెట్టుకుంటారు అని చెప్పారు.